Home » Manipur
రాష్ట్రీయ్ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేం దేవుళ్లమో కాదో ప్రజలే నిర్ణయిస్తారని అభిప్రాయ పడ్డారు. ఆ విషయాన్ని తాము ఏ రోజు చెప్పకోబోమని స్పష్టం చేశారు.
మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్‌లో రైఫిళ్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. అందుకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం సెక్మై లీకింతబీలోని బీజేపీ ఎమ్మెల్యే జాయ్ కిషన్ సింగ్ ఫామ్‌హౌస్‌లోని మూడు రైఫిళ్లను దుండగులు దొంగిలించారు.
అల్లర్లతో అతలాకుతలమవుతున్న మణిపూర్‌ను సందర్శించాలని ప్రధాని మోదీకి విపక్షనేత రాహుల్ గాంధీ మరోమారు విజ్ఞప్తి చేశారు. సాధ్యమైనంత త్వరగా శాంతియుత ప
ఆగస్ట్ 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులు జరుపుకుంటున్న వేళ.. గురువారం ఎక్స్ వేదికగా ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మణిపూర్ ప్రజలకు సంబంధించిన ఫోటోను ఆయన షేర్ చేశారు. జాతుల మధ్య వైషమ్యాల కారణంగా మణిపూర్ ప్రజలకు ఓదార్పు ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీకి ఈ సందర్భంగా ఆయన సూచించారు.
2015, ఆగస్ట్‌లో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా రేఖా శర్మ నియమితులయ్యారు. అనంతరం 2017, సెప్టెంబర్ 29న కమిషన్ చైర్ పర్సన్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2018లో జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా నియమితులయ్యారు. నాటి నుంచి మంగళవారం వరకు ఆమె.. ఈ చైర్ పర్సన్ పదవిలో కొనసాగారు.
మణిపూర్‌లోని జిరిబమ్‌లో భద్రత దళాల కాన్వాయిపై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఖండించారు. మణిపూర్‌లో జాతుల మధ్య సంఘర్ణణకు ముగింపు పలికేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీకి ఆమె విజ్జప్తి చేశారు.
మణిపూర్‌లో జిరిబం జిల్లాలోని మాంగ్‌బంగ్ ప్రాంతంలో ఆదివారం ఉదయం భద్రతా బలగాలపై జరిగిన దాడిలో ఓ సీఆర్పీఎ్ఫ(సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్) జవాన్ మృతి చెందారు.
మణిపూర్ లో మళ్లీ సాయుధ దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాను ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. జిరిబామ్ జిల్లా మాంగ్‌బుగ్, సెయిజాంగ్ గ్రామాల్లో సాయుధ దుండగులకు, రాష్ట్ర-కేంద్ర పోలీసు బలగాలకు మధ్య ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి.
మణిపూర్‌లో శాంతి స్థాపన అంశంపై పార్లమెంట్ సమావేశాల్లో బలంగా మాట్లాడతామని కాంగ్రెస్, ఇండియా కూటమి తరఫున లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో గతేడాది మేలో ఘర్షణలు చెలరేగాయి. దాంతో ఆ రాష్ట్రం అతలాకుతలమైంది. ఈ నేపథ్యంలో మణిపూర్‌ను సందర్శించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ విజ్జప్తి చేశారు.