Home » Manipur
మణిపుర్లో(Manipur Riots) గతేడాది జరిగిన హింసలో బాధితులను పరామర్శించడానికి ప్రధాని మోదీకి(PM Modi) సమయం ఉండట్లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్(Jairam Ramesh) విమర్శించారు. ఒక్కసారీ మణిపుర్‌కి రాని మోదీ.. విదేశీ పర్యటనకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు.
ఆపదల్లో ప్రాణం కాపాడిన వారిని దేవుడిలా వచ్చి కాపాడావంటూ కృతజ్ఞతలు చెప్పుకోవడం సహజం. ప్రకృతి ప్రకోపంతో వరద నీటిలో చిక్కుకున్న ఓ మణిపూర్ యువకుడు తనను లైఫ్ బోట్‌తో కాపాడిన అసోం రైఫిల్స్ సిబ్బందికి వినూత్న రీతిలో కృతజ్ఞతలు తెలియజేయాడు. సంప్రదాయ గీతాన్ని వారికి వినిపించి ఉత్సాహపరిచాడు.
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్, గుజరాత్‌లోని టీఆర్పీ గేమ్ జోన్ ఫైర్, మోర్బీ వంతెన కుప్పకూలిన ఘటనల్లో బాధితులను శుక్ర, శనివారాల్లో పరామర్శించిన కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తాజాగా మణిపూర్‌లో పర్యటించనున్నారు. జూలై 8న ఆయన మణిపూర్‌లో పర్యటించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
మణిపూర్ రాష్ట్రంలో శాంతి భద్రతలపై కేంద్రం దృష్టి సారించింది. ఆ క్రమంతో ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ఈ సందర్బంగా చర్చించారు.
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ బంగ్లా సమీపంలో ఎవరూ లేని ఒక భవంతిలో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చెలరేగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో నాలుగు అగ్నిమాపక శకటాలు అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశాయి.
మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ కాన్వాయ్‌పై మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ మెరుపు దాడిలో భద్రతా సిబ్బంది ఒకరు గాయపడ్డారు. సోమవారం ఉదయం జిరిబామ్ సమీపంలో జాతీయ రహదారి-37పై ఈ ఘటన చోటుచేసుకుంది. మైతేయి-కుకీ తెగల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న జిరిబామ్‌ను సీఎం బీరేన్ మంగళవారం సందర్శించాల్సి ఉంది.
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ అడ్వాన్స్ సెక్యూరిటీ కాన్వాయ్‌పై మిలిటెంట్లు సోమవారంనాడు కాల్పులకు తెగబడ్డారు. కల్లోలిత జీరాబామ్ జిల్లాకి కాన్వాయ్ వెళ్తుండగా మార్గమధ్యంలోని కాంగ్పోక్పి జిల్లాలో మిలిటెంట్లు పలురౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో భద్రతా సిబ్బంది ఒకరు గాయపడ్డారు.
బంగాళఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాన్(Remal Cyclone) కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఘటనలో చనిపోయిన కుటుంబాలకు రూ.2 లక్షలు ఇస్తామని ప్రధాని మోదీ శుక్రవారం ప్రకటించారు.
మణిపూర్(Manipur)లోని పలు ప్రాంతాల్లో ఆదివారం కురిసిన భారీ వర్షం(heavy rain), వడగళ్ల వాన కారణంగా పలు ఇళ్లు, అనేక వాహనాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇంఫాల్ వెస్ట్‌లోని కాంచీపూర్, తేరాతో సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చాలా ఇళ్లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం రాష్ట్రంలో మే 6, మే 7న పాఠశాలలు(Schools), కళాశాలలు(colleges) బంద్ చేస్తున్నట్లు సీఎం ఎన్ బీరెన్ సింగ్(Biren Singh) సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
గతేడాది మే 3న మణిపూర్ ప్రారంభమైన హింస నేటికీ కొనసాగుతోందని, కుటుంబ సభ్యులతోపాటు ఇళ్లు, ఆస్తులు, కుటుంబాలను కోల్పోయిన వేలాదిమంది నిరాశ్రయులయ్యారని హైదరాబాద్‌లో నివసిస్తున్న మణీపూర్(Manipur) కూకీ-జో తెగలకు చెందిన ప్రతినిధులు పేర్కొన్నారు.