Share News

RSS: మేం దేవుళ్లమో కాదో ప్రజలు నిర్ణయిస్తారు..

ABN , Publish Date - Sep 06 , 2024 | 03:47 PM

రాష్ట్రీయ్ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేం దేవుళ్లమో కాదో ప్రజలే నిర్ణయిస్తారని అభిప్రాయ పడ్డారు. ఆ విషయాన్ని తాము ఏ రోజు చెప్పకోబోమని స్పష్టం చేశారు.

RSS:  మేం దేవుళ్లమో కాదో ప్రజలు నిర్ణయిస్తారు..
Mohan Bhagwat

పుణె: రాష్ట్రీయ్ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) సంచలన వ్యాఖ్యలు చేశారు. మేం దేవుళ్లమో కాదో ప్రజలే నిర్ణయిస్తారని అభిప్రాయ పడ్డారు. ఆ విషయాన్ని తాము ఏ రోజు చెప్పకోబోమని స్పష్టం చేశారు. శుక్రవారం పుణెలో జరిగిన శంకర్ దినకర్ (భయ్యాజీ) జ్ఞాపకార్థం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. శంకర్ దినకర్‌ను అంతా భయ్యాజీ అని పిలుచుకుంటారు. 1971లో భయ్యాజీ విద్యార్థుల కోసం కృషి చేశారు. అందరికీ విద్య అందించడం కోసం పాటు పడ్డారు. కొందరిని మహారాష్ట్ర తీసుకొచ్చి మరి చదివించారు.


rss.jpg


విపత్కర పరిస్థితుల్లో

‘కొందరు ప్రశాంతంగా ఉండాలని అనుకోరు. ఒక్కసారిగా మెరవాలని అనుకుంటారు. పిడుగులు పడితే గతంలో కంటే జీవితం చీకటిగా మారుతుంది. కార్మికులు దీపాల మాదిరిగా వెలిగిపోవాలి. అవసరమైన సమయంలో మెరవాలి’ అని మోహన్ భగవత్ అభిప్రాయ పడ్డారు. సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు మణిపూర్‌లో పనిచేశారు. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 200 మంది వరకు చనిపోగా, 60 వేల మంది ఆశ్రయం కోల్పోయారని గుర్తుచేశారు.


rss.jpg


భద్రత లేదు

‘మణిపూర్‌ రాష్ట్రం విపత్కర పరిస్థితిని ఎదుర్కోంది. ఇక్కడ ప్రజలకు సరైన భద్రత లేదు. ఇదే విషయంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపారం లేదా సామాజిక పనుల కోసం మణిపూర్ వెళ్లినవారు పలు సవాళ్లను ఎదుర్కొంటున్నారు అని’ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. విపత్కర పరిస్థితుల్లో సంఘ్ కార్యకర్తలు అక్కడే ఉన్నారు. పరిస్థితిని మెరుగు పరిచే ప్రయత్నం చేశారని ప్రశంసలతో ముంచెత్తారు. రెండు గ్రూపుల మధ్య తలెత్తిన వివాదంతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా.. సంఘ్ కార్యకర్తలు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు తప్ప.. రాష్ట్రాన్ని విడిపోలేదని మోహన్ భగవత్ వివరించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ భగవత్ మణిపూర్ గురించి ప్రస్తావించారు. ఓటు బ్యాంకును తమ వైపునకు తిప్పుకొనే ప్రయత్నం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Sep 06 , 2024 | 03:47 PM