Home » Medigadda Barrage
కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టు ( Medigadda project ) కు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ( CM Revanth Reddy ) ఆదేశించారు. ఆదివారం తన నివాసంలో నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నీటిపారుదల రంగం పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ, అన్నారంలో జరిగిన లోపాలపై దర్యాప్తు జరిపిస్తామని మంత్రి శ్రీధర్ బాబు ( Minister Sridhar Babu ) తెలిపారు.
మేడిగడ్డ కుంగడంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్రెడ్డి ( CM Revanth Reddy ) స్పష్టం చేశారు. శనివారం నాడు అసెంబ్లీ సమావేశాల అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ..త్వరలోనే ప్రజాప్రతినిధులను మేడిగడ్డకు తీసుకెళ్తాం అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్లోని మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజ్( Medigadda (Lakshmi) Barrage ) లో తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Minister Uttam Kumar Reddy ) హెచ్చరించారు. సోమవారం నాడు జలసౌధలో నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ(Medigadda barrage) పిల్లర్లు కుంగడ, గతంలో కన్నెపల్లి పంపుహౌజ్
లక్ష కోట్ల అప్పులు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్ అంధకారంగా మారిందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
‘‘మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్-7లో ఉత్పన్నమైన సమస్యను రిపేరు చేయడానికి వీల్లేదు. మొత్తం బ్లాక్ను పునాదుల నుంచి తొలగించి, పునర్నిర్మించాలి.
సిద్దిపేట జిల్లా: మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడంపై కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో కీలకమైన అంశాలను పేర్కొంది. మొత్తం 21 అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరితే కేవలం 11 అంశాలపైనే వివరణ ఇచ్చిందని కమిటీ తెలిపింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో మరో లోపం బయటపడింది. అన్నారం సరస్వతి బ్యారేజీకి లీకేజీలు కలకలం రేపుతున్నాయి. బ్యారేజీలో 28, 38 నంబర్ గల రెండు గేట్ల వద్ద లీకేజీతో నీరు ఉబికి వస్తోంది.
మేడిగడ్డపై కేంద్రం డెడ్లైన్ విధించింది. మేడిగడ్డపై కేంద్ర జలశక్తి శాఖ కమిటీ ప్రాజెక్టు నివేదికలు కోరింది. ప్రాజెక్టుకు సంబంధించిన 20 వేర్వేరు డాక్యుమెంట్లను కమిటీ కోరింది. వాటిలో 3 నివేదికలు, మరో నివేదికలో పాక్షికభాగం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది.