Home » MLA
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డిపై ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది.
కూటమి ప్రభుత్వం రైతుల సమస్య పరిష్కార దిశగా ముందుకెళుతోందని, సాగునీటి సంఘాల కమిటీలు బాధ్యతగా పనిచేయాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ సూచించారు.
మీకున్న పదవులతో బాధ్యతా యు తంగా పనిచేసి చెరువులకింద రైతులు నష్టపోకుండా చూడాలని సాగునీటి సం ఘం నూతన సభ్యులకు ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. శనివారం జరిగి న ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్ష, ఉపాద్యక్షులు, సభ్యులు ఆదివారం వెంకటాపురంలో ఎమ్మెల్యేని కలిశారు. ఎటువంటి గొడవలులేకుండా ఏకగ్రీవంగా గెలవడంపై హర్షం వ్యక్తం చేసి, నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బోండేకర్‌కు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ క్యాబినెట్లో చోటు దక్కలేదు. దీంతో పార్టీ పదవికి రాజీనామా చేశారు.
ఇవి పదవులు కాదు.. బాధ్యతలన్నది మరచిపోవద్దని ఎమ్మెల్యే పరిటాల సునీత సూ చించారు. నియోజకవర్గంలో శనివారం ఎన్నికైన సాగునీటి సంఘాల అధ్యక్షులు, ఉపాఽధ్యక్షులు, టీసీ మెంబ ర్లు నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గం ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్‌ను కలిశారు. పుష్పగుచ్ధాలు అందజేశారు.
గోషామహల్ స్టేడియం(Goshamahal Stadium)లో ఉస్మానియా ఆస్పత్రిని నిర్మించొద్దని ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja Singh) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి శుక్రవారం లేఖ రాశారు. ‘మీరు గోషామహల్ స్టేడియంలో నిర్మించతలపెట్టిన ఉస్మానియా భవనం ప్రాజెక్టును మరోచోటుకు మార్చాలని కోరుతున్నాను.
జమిలి ఎన్నికలు వస్తాయని వైసీపీ నాయకులు సంబరపడుతున్నారని, అయితే జమిలి ఎన్నికల వల్ల వైసీపీ శాశ్వతంగా ప్రతిపక్షంలో కూచుంటుందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఎద్దేవా చేశారు.
సార్వత్రిక ఎన్నికల్లో భారీ పరాజయం తర్వాత.. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి నడిచేందుకు పలువురు మాజీ ఎమ్మెల్యేలు విముఖత చూపుతున్నారు. కొందరు బయటపడుతుండగా.. ఇంకొందరు గుంభనంగా ఉంటున్నారు.
రెవెన్యూ సదస్సులో ప్రతి భూసమస్యకు పరిష్కారం చూపేందుకే అధికారులు ప్రజల వద్దకు వస్తు న్నారని ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.
రాప్తాడు నియోజకవర్గంలో ఈ నెల 14వ తేదీ నుంచి జరిగే సాగునీటి సంఘాల ఎన్నికలు రాజకీయాలకు అ తీతంగా జరగాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. ఆమె గురువారం అనంతపురం లోని తన క్యాంప్ కార్యాలయంలో టీడీపీ నాయకులతో సమావేశమయ్యారు. రాప్తాడు నియోజకవర్గంలోని 32 చెరువుల పరిధిలో సాగు నీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయన్నారు.