Home » MLC Elections
గడిచిన పదేళ్లలో ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర ఏ ఎన్నికలు వచ్చినా దూకుడుగా వ్యవహరించిన బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏమాత్రం ఆసక్తి చూపకపోవడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది.
Nimmala Ramanaidu: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపించాలని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. బుధవారం ఎమ్మెల్సీ ఎలక్షన్ అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి కూటమి నేతలకు పలు సూచనలు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిచేలా ప్రతి ఒక్కరు పని చేయాలని అన్నారు.
కోమసీమ జిల్లా మలికిపురం మండలం లక్కవరంలో ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అచ్చెన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నగరా మోగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలియవచ్చింది. కొందరు ఆశావహులు పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని అధి నాయకత్వాన్ని కోరినట్లు సమాచారం.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి, గుంటూరు- కృష్ణా, ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది.
పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. దాంతో.. సోమవారం నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. 10వ తేదీ వరకు నామినేషన్లకు అవకాశం ఉండగా.. 11న స్ర్కూటినీ నిర్వహిస్తారు.
కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిగా.. అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఊటుకూరి నరేందర్‌రెడ్డిని కాంగ్రెస్ ప్రకటించింది.
CM Chandrababu: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. క్లస్టర్, యూనిట్, బూత్, ఇంచార్జ్‌లతో పాటు, జనసేన, బీజేపీ కమిటీల నేతలతో ముందుకెళ్లాలని నిర్దేశించారు. ఈ ఎన్నికలు ఏపక్షంగా జరగాలని... ఏ ఎన్నిక వచ్చినా గెలిచినప్పుడే సుస్థిర పాలన ఉంటుందని.. ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతుందని చెప్పారు.
కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్‌రెడ్డిని అభ్యర్థిగా నిలపాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.
ఇరువురు నాయకులు ఉపాధ్యాయ ఉద్యమంలో పనిచేసి, నిబద్ధతతో వ్యవహరించారని యూటీఎఫ్, టీపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి, సిహెచ్ అనిల్ కుమార్, ఎ వెంకట్, ఎన్ తిరుపతి పాల్గొన్నారు.