Share News

MLC Elections: నేటి నుంచి ఎమ్మెల్సీ నామినేషన్లు

ABN , Publish Date - Feb 03 , 2025 | 03:55 AM

పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్‌ విడుదల కానుంది. దాంతో.. సోమవారం నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. 10వ తేదీ వరకు నామినేషన్లకు అవకాశం ఉండగా.. 11న స్ర్కూటినీ నిర్వహిస్తారు.

MLC Elections: నేటి నుంచి ఎమ్మెల్సీ నామినేషన్లు

  • 10వ తేదీ వరకు దాఖలుకు అవకాశం

  • నల్లగొండ మునిసిపల్‌ కమిషనర్‌పై ఈసీకి బీఆర్‌ఎస్‌ నేతల ఫిర్యాదు

  • కరీంనగర్‌ పట్టభద్రుల ఎన్నికలు బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ

  • రెబెల్‌గా రవీందర్‌సింగ్‌ పోటీ

నల్లగొండ, కరీంనగర్‌, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్‌ విడుదల కానుంది. దాంతో.. సోమవారం నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. 10వ తేదీ వరకు నామినేషన్లకు అవకాశం ఉండగా.. 11న స్ర్కూటినీ నిర్వహిస్తారు. 13న ఉపసంహరణకు అవకాముంటుంది. 27న పోలింగ్‌ జరుగుతుంది. వచ్చేనెల 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. షెడ్యూల్‌ విడుదలైన రోజు నుంచే కోడ్‌ అమల్లోకి రాగా.. ఉమ్మడి ఖమ్మం-వరంగల్‌-నల్లగొండ ఉపాధ్యాయ స్థానానికి సంబంధించిన నామినేషన్లను నల్లగొండ కలెక్టరేట్‌లో స్వీకరిస్తారు. మూడు ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 12 కొత్త జిల్లాలున్నాయి. 24,905 మంది ఓటర్లుండగా.. 191 మండలాల్లో 200 పోలింగ్‌స్టేషన్లను ఏర్పాటు చేశారు.


నల్లగొండలో ఫ్లెక్సీలపై వివాదం

నల్లగొండ మునిసిపాలిటీలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంపై బీఆర్‌ఎస్‌ పట్టణ కమిటీ ఆదివారం ఫ్యాక్స్‌ ద్వారా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసింది. ఫ్లెక్సీలను తొలగించాలని మునిసిపల్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆ ఫిర్యాదులో ఆరోపించింది. మరోవైపు.. కరీంనగర్‌-మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే నరేందర్‌రెడ్డిని, అంజిరెడ్డిని బీజేపీ తమ అభ్యర్థులుగా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ బీసీ కార్డుతో ముందుకెళ్లాలని నిర్ణయించింది. కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఆశించి, భంగపడ్డ ప్రసన్న హరికృష్ణను తమ అభ్యర్థిగా ప్రకటించేందుకు సిద్ధమైంది. బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావు ఈ మేరకు పార్టీ చీఫ్‌ కేసీఆర్‌కు ప్రతిపాదించారని, ఆయన సోమవారం అధికారికంగా ప్రకటన చేస్తారని తెలుస్తోంది. అయితే.. బీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ ఆశించిన కరీంనగర్‌ మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ రెబల్‌గా పోటీలో దిగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.


ఇవీ చదవండి:

ఏపీకి కేంద్రం వరాల జల్లు.. కేటాయింపులు అదిరిపోయాయి

కేంద్ర ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల పూర్తి వివరాలు ఇవే..

భారీగా తగ్గనున్న ఈ వస్తువుల ధరల

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 03 , 2025 | 03:55 AM