Home » Narasaraopet
నరసరావుపేటలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. పోలింగ్ సందర్భంగా వైసీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులపై వైసీపీ నేతలు దాడి చేశారు. మల్లమ్మ సెంటర్‌లో టీడీపీకి చెందిన నేత వాహనాన్ని నడిరోడ్డుపై వైసీపీ నేతలు తగలబెట్టారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అధికార వైసీపీ నిబంధనలను తుంగలో తొక్కుతుంది. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఆ పార్టీ అభ్యర్థి లేదంటే కార్యకర్తలు రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. అదేంటని ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు. నరసరావుపేట పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి హల్ చల్ చేశారు.
అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి సోమవారం రాజీనామా చేశారు. ఆ పార్టీ ప్రాధమిక సభ్యత్వంతోపాటు ఆ రాష్ట్ర బీసీ విభాగం అధ్యక్ష పదవికి సైతం ఆయన రాజీనామా చెసేశారు. ఆయన త్వరలో టీడీపీలో చేరనున్నారు.
అమరావతి: గుంటూరు జిల్లా, నరసారావు పేటలో తెలుగుదేశం పార్టీ శ్రేణులపై దాడులను ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న నియోజకవర్గ ఇంచార్జ్ అరవింద్ బాబు, కార్యకర్తలపై వైసీపీ వర్గీయులు చేసిన దాడిలో పలువురికి గాయాలయ్యాయి.
TDP-Janasena-BJP : ఆంధ్రప్రదేశ్‌లో 2024 సార్వత్రిక ఎన్నికల (AP Elections 2024) నోటిఫికేషన్‌కు ముందే పొలిటికల్ సీన్ మొత్తం మారిపోయింది. టీడీపీ-జనసేన-బీజేపీ (TDP-Janasena-BJP) పొత్తుతో ఒక్కసారిగా అధికార వైసీపీలో ఉలిక్కిపాటు మొదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల ఢిల్లీ టూర్‌తో బీజేపీతో పొత్తు కుదిరింది. ఢిల్లీ వేదికగా బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో బాబు, పవన్ జరిపిన చర్చలు సక్సెస్ అయ్యాయి..
AP Politics: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రాజకీయాలు (AP Politics) వేడెక్కాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయ్. ఈ ఎన్నికల్లో ఏం చేసైనా సరే గెలిచి తీరాల్సిందేనని వైసీపీ.. ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడానికి వీల్లేదని టీడీపీ-జనసేన (TDP-Janasena) కూటమి వ్యూహ రచనలు చేస్తున్నాయ్. ఇందుకోసం ఏ చిన్నపాటి చాన్స్ వచ్చినా అటు టీడీపీ.. ఇటు వైసీపీ (YSR Congress) వదులుకోవట్లేదు. ఓ వైపు అభ్యర్థులను ప్రకటించి వైసీపీ దూకుడు మీదుంటే.. తగ్గేదేలే అంటూ..
పల్నాడు జిల్లా: పల్నాడులో కీలక నేత, నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మార్చి 2వ తేదీన (శనివారం) తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆ రోజు గురజాలలో జరిగే ‘రా కదలి రా’ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో చేరుతున్నట్లు తెలిపారు.
పల్నాడులో కీలక నేత, నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు భవిష్యత్ కార్యాచరణపై సర్వత్రా చర్చ జరుగుతుంది. ఆయన ఏ పార్టీలో చేరతారని అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి మరో షాక్ తగిలింది. నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు లోక్ సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.
నరసరావుపేటలో (Narasa Raopet) తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నరసరావుపేట టీడీపీ ఇన్చార్జ్ చదలవాడ అరవింద్‌పై (Narasaraopet TDP in-charge Chadalawada Arvind) వైసీపీ దాడికి యత్నించింది.