AP Politics: టీడీపీ-జనసేన భారీ బహిరంగ సభ.. కీలక ప్రకటన చేయనున్న మోదీ
ABN , Publish Date - Mar 09 , 2024 | 06:13 PM
TDP-Janasena-BJP : ఆంధ్రప్రదేశ్‌లో 2024 సార్వత్రిక ఎన్నికల (AP Elections 2024) నోటిఫికేషన్‌కు ముందే పొలిటికల్ సీన్ మొత్తం మారిపోయింది. టీడీపీ-జనసేన-బీజేపీ (TDP-Janasena-BJP) పొత్తుతో ఒక్కసారిగా అధికార వైసీపీలో ఉలిక్కిపాటు మొదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల ఢిల్లీ టూర్‌తో బీజేపీతో పొత్తు కుదిరింది. ఢిల్లీ వేదికగా బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో బాబు, పవన్ జరిపిన చర్చలు సక్సెస్ అయ్యాయి..
ఆంధ్రప్రదేశ్‌లో 2024 సార్వత్రిక ఎన్నికల (AP Elections 2024) నోటిఫికేషన్‌కు ముందే పొలిటికల్ సీన్ మొత్తం మారిపోయింది. టీడీపీ-జనసేన-బీజేపీ (TDP-Janasena-BJP) పొత్తుతో ఒక్కసారిగా అధికార వైసీపీలో ఉలిక్కిపాటు మొదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల ఢిల్లీ టూర్‌తో బీజేపీతో పొత్తు కుదిరింది. ఢిల్లీ వేదికగా బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో బాబు, పవన్ జరిపిన చర్చలు సక్సెస్ అయ్యాయి. మరోసారి జరిగే మీటింగ్‌లో సీట్ల లెక్కలు తేలిపోతాయని కూటమి చెబుతోంది. ఇకపై మూడు పార్టీలు కలిసి ఉమ్మడి కార్యాచరణను ప్రకటించనున్నాయి. బీజేపీతో పొత్తు ఫిక్స్ కావడంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తిరుగుపయనం అయ్యారు.
బీజేపీతో పొత్తుపై చంద్రబాబు కీలక ప్రకటన.. ఎన్ని సీట్లు ఇచ్చారంటే..?
పేటకు ప్రధాని..!
ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రాకముందే టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఢిల్లీ పర్యటనలో జరిగిన విషయాలు.. బీజేపీకి ఇచ్చే సీట్ల లెక్కలు.. బీజేపీ అడిగిన సీట్ల గురించి నిశితంగా చర్చించారు. ఇందులో భాగంగా.. మూడు పార్టీల ఉమ్మడి కార్యాచరణలో భాగంగా ఈ నెల 17న లేదా 18న భారీ బహిరంగ సభను టీడీపీ-జనసేన నిర్వహించబోతోంది. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేయనున్నారు. నరసారావుపేట వేదికగా ఈ భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభను చంద్రబాబు, పవన్ ఇద్దరూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సభకు రావాలని మోదీని ఆహ్వానించారు. ఈ మేరకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు చంద్రబాబు, పవన్ విజ్ఞప్తి చేశారు. ఒకవేళ 17న ప్రధానికి వీలుకాకుంటే మరోరోజు 18న లేదా 19న సభకు సర్వం సిద్ధం చేస్తామని నడ్డాకు చంద్రబాబు స్పష్టం చేశారు.
AP Elections: టీడీపీ-జనసేన.. బీజేపీ పొత్తుపై కీలక అప్డేట్.. ఏబీఎన్ ఎక్స్‌క్లూజివ్
ఏపీకి వచ్చి ఏం చేస్తారో..?
పేటకు ప్రధాని నరేంద్ర మోదీ వస్తే.. రాష్ట్రానికి మేలు జరిగేలా కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ ప్రకటనలు ఓటర్లను కట్టిపడేసేలా.. మరో కూటమికే ఓట్లు పడేలా ఉంటాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆ ప్రకటనలు ఏమై ఉంటాయి..? అని రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు.. ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ గురించి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ఏమేం మాట్లాడుతారో అనేదానిపై కూడా టీడీపీ, జనసేన, బీజేపీ.. వైసీపీ పార్టీ్ల్లో సర్వత్రా ఆసక్తి మొదలైంది. సభకు మోదీ వచ్చే లోపే.. సీట్ల లెక్కలు, ఇంకా ఉమ్మడి కార్యాచరణ లాంటివి దాదాపు కొలిక్కి వచ్చేస్తాయని తెలుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే బీజేపీతో పొత్తు అని టీడీపీ చెబుతుండగా.. బీజేపీతోనే రాష్ట్రానికి భవిష్యత్తు అని కమలనాథులు చెబుతున్నారు. పొత్తు ఆవశ్యకతను ప్రజలకు వివరించే బాధ్యతను పార్టీ ముఖ్యనేతలకు చంద్రబాబు అప్పగించారు. మొత్తానికి చూస్తే.. 2024లో కూటమి అధికారంలోకి రావడానికి గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి.
Pawan Kalyan: ఢిల్లీ పర్యటనలో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన పవన్ కల్యాణ్!
మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి