Hyderabad: మాట్లాడుకుంటున్న జంటపై దాడి..
ABN , Publish Date - Mar 21 , 2025 | 06:44 AM
కొద్దిరోజుల్లో వివాహం చేసుకోనున్న ఓ జంట ఏకాంతంగా మాట్లాడుకుంటుండగా గుర్తు తెలియని యువకులు వారిపై దాడిచేసి గాయపరిచిన సంఘటన మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తీవ్ర భయభ్రాంతులకు గురైన ఆ జంట కారులో వెళ్లిపోతుండగా.. బానెట్‌పైకి ఎక్కి వీరంగం సృష్టించారు. ఇంవుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

- యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తూ వీరంగం
- మలక్‌పేటలో ఐదుగురు యువకుల హల్‌చల్
హైదరాబాద్: త్వరలో వివాహం చేసుకోనున్న జంట ఏకాంతంగా మాట్లాడుకుంటుండగా గుర్తు తెలియని యువకులు దాడికి పాల్పడ్డారు. కారులో ఉన్న యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తూ బయటకు లాగేందుకు ప్రయత్నించారు. భయభ్రాంతులకు గురైన ఆ జంట కారులో వెళ్లిపోతుండగా.. బానెట్‌పైకి ఎక్కి వీరంగం సృష్టించారు. ఏకంగా కిలోమీటరుపైగా వారిని వెంబడించారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న బైక్‌లను కారు ఢీ కొట్టింది. అదే సమయంలో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు.
ఈ వార్తను కూడా చదవండి: High Court: బండి సంజయ్‌పై కేసు కొట్టివేత
మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హయత్‌నగర్‌కు చెందిన వంశీకృష్ణ, తనకు కాబోయే భార్యతో మంగళవారం రాత్రి 7గంటల సమయంలో మలక్‌పేట పోలీస్ స్టేషన్ వెనుకనున్న హిల్స్‌గ్రౌండ్‌లో కారులో మాట్లాడుతున్నాడు. ఐదుగురు గుర్తుతెలియని యువకులు కారు వద్దకు వచ్చారు. కారు అద్దాలు తీయాలంటూ గట్టిగా కేకలు వేస్తూ భయబ్రాంతులకు గురి చేశారు.
దీంతో వంశీకృష్ణ(Vamsi Krishna) కారును స్టార్ట్ చేసి ముందుకు నడిపే ప్రయత్నం చేస్తుండగానే ఇద్దరు దుండగులు యువతిని బయటికి లాగే ప్రయత్నం చేశారు. కారు బానెట్‌పై కూర్చొని అద్దాలు పగులగొట్టారు. అయినప్పటికీ వంశీకృష్ణ కారును ముందుకు నడిపాడు. ఈ క్రమంలో వంశీకృష్ణ కారు రెండు ద్విచక్రవాహనాలను ఢీకొట్టింది.
బ్యానెట్‌పై ఉన్న వ్యక్తులు కిందకు దూకి పారిపోగా.. ద్విచక్రవాహనాలపై ఉన్న యువకులు వంశీ కృష్ణను కొట్టి మలక్‌పేట(Malakpet) పోలీసులకు అప్పగించారు. అనంతరం బాధితుడు వంశీకృష్ణ చెప్పిన వివరాల మేరకు దాడికి పాల్పడిన యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Online Betting: ముదిరిన బెట్టింగ్ వ్యవహారం.. తారలపై కేసులు
BJP: రాజాసింగ్‌కు బుల్లెట్ ప్రూఫ్ కారు
పంచుకు తింటే.. పట్టు వచ్చినట్లా?
Read Latest Telangana News and National News