Home » New Delhi
లఢక్కు రాష్ట్ర హోదా, ఆరో షెడ్యూల్లో చేర్చాలన్న డిమాండ్పై వాంగ్చుక్ తదితరులు అక్టోబర్ 6వ తేదీ నుంచి ఢిల్లీలోని లఢక్ భవన్లో నిరాహార దీక్ష సాగిస్తున్నారు.
తెలంగాణలో గ్రూప్-1 పరీక్షను వాయిదా వేయాలని, జీవో -29 రద్దు చేయాలని కోరుతూ పోగుల రాంబాబు అనే అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరగనుంది.
కెనడాలో నివసించే భారతీయులపై విద్వేష నేరాలు పెరిగిపోతున్నాయని భారత సంతతికి చెందిన కెనడా పౌరుడు అశ్విన్ అన్నామలై ఆందోళన వ్యక్తం చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం కలకలం రేగింది. ప్రశాంత్ విహార్ సీఆర్పీఎఫ్ పాఠశాల ప్రహరీ గోడ వద్ద ఉదయం 7.50 గంటల సమయంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది.
దేశరాజధానిలోని ప్రశాత్ విహార్ ఏరియాలో ఉన్న సీఆర్పీఎఫ్ కార్యాలయం సమీపంలో శనివారం ఉదయం జరిగిన పేలుడు ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది. ఘటనా స్థలంలో తెల్లడి పౌడర్ మిశ్రమాన్ని కనుగొన్నట్టు అధికారులు తెలిపారు.
బాల్య వివాహం ఓ సామాజిక దురాచారమని, పర్సనల్ చట్టాలు, వాటిలోని సంప్రదాయాలు బాల్య వివాహ నిరోధక చట్టాన్ని అడ్డుకోజాలవని సుప్రీంకోర్టు పేర్కొంది.
సరిగ్గా ఇదే సమయంలో భారత్, కెనడా మధ్య మాటల యుద్దం జరుగుతుంది. నిజ్జర్ హత్య కేసులో కెనడాలోని భారత రాయబారి వర్మ పేరు ప్రస్తావించింది. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ క్రమంలో భారత్లోని కెనడా రాయబారితో పాటు ఆ కార్యాలయంలోని నలుగురు ఉద్యోగులు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది.
మొత్తం 31 డ్రోన్లలో 15 డ్రోన్లు నావికాదళానికి సరఫరా అవుతాయి. తక్కిన వాటిని ఆర్మీ, వైమానికి దళానికి సమానంగా విభజించనున్నారు.
దుర్గామాత నిమజ్జనం సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని బహ్రాయీచ్ జిల్లాలో ఆదివారం జరిగిన మతపరమైన గొడవలో ఓ యువకుడు చనిపోయిన ఘటన సోమవారం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చైర్మన్ డాక్టర్ ఎస్.సోమనాథ్కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక ‘ఐఏఎఫ్ వరల్డ్ స్పేస్ అవార్డు-2024’ను ఆయన సోమవారం అందుకున్నారు.