Home » NIA
భారత్ - కెనడాల(India - Canada) మధ్య ఖలిస్థానీ(Khalisthan) ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ రాజేసిన చిచ్చు రోజు రోజుకీ నివురుగప్పిన నిప్పులా మారుతోంది. ఇదే సమయంలో ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన తాజా నివేదిక సంచలనం సృష్టిస్తోంది. అందులోని వివరాల ప్రకారం.. భారత్, కెనడాల మధ్య గొడవలు సృష్టించడానికి పాకిస్థాన్ కుట్రలు పన్నింది.
ఖలిస్తానీ - గ్యాంగ్‌స్టర్ మూకల స్థావరాలే టార్గెట్‌గా జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) రాజస్థాన్(Rajasthan) లో ఇవాళ ఉదయం నుంచి దాడులు నిర్వహిస్తోంది. శ్రీగంగానగర్, హనుమాన్‌గఢ్, జైసల్మేర్, జోధ్‌పూర్, జుంజునుతో సహా ఐవ్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అధికారులు బందోబస్తు నిర్వహించారు.
ఖలిస్థాన్ అనుకూలవాద ఉగ్రవాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ కు చెందిన ఉగ్రవాది గుర్‌పత్వంత్ సింగ్ పన్నూ ఆస్తులపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ శనివారంనాడు దాడులు చేసింది. పన్నూకు చెందిన ఛండీగఢ్, అమృత్‌సర్‌లోని ఆస్తులను స్వాధీనం చేసుకుంది.
చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం(Unlawful Activities (Prevention) Act) కింద చండీగఢ్(Chandigarh), అమృత్‌సర్‌లలో నిషేధిత సిక్కుల న్యాయ సంస్థ(SFJ) అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్(Gurpatwant Singh Pannu) ఆస్తులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) శనివారం జప్తు చేసింది.
నగరంలో ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. శనివారం ఉదయం పాతబస్తీ సహా నాలుగుచోట్ల ఎన్‌ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. ఐఎస్‌ఐ సానుభూతిపరులుగా అనుమానిస్తున్న వారి నివాసాల్లో రైడ్స్ జరుగుతున్నాయి.
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్(Telangana, Chhattisgarh) రాష్ట్రాలల్లో NIA సోదాలు(NIA searches) చేపట్టింది.
హైదరాబాదీ ఉగ్రవాదులు అబ్దుల్ బాసిత్, అబ్దుల్ ఖాదిర్‌లను దోషులుగా తేల్చి 5 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేస్తూ ఎన్ఐఏ ఢిల్లీ కోర్టు తీర్పును వెలువరించింది. 2018లో వీరిద్దరినీ ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.
కోడికత్తి కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. కేసును విజయవాడ నుంచి విశాఖ ఎన్‌ఐఏ కోర్టుకు బదిలీ చేస్తూ విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుంచి కోడికత్తి కేసు విచారణ విశాఖ ఎన్‌ఐఏ కోర్టు చేపడుతుందని న్యాయమూర్తి వెల్లడించారు.
కోడి కత్తి కేసులో (Kodi Katti Case) ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి (Cm Jagan) ఎన్ఐఏ కోర్టులో (NIA court) ఎదురు దెబ్బ తగిలింది. కోడి కత్తి కేసులో తదుపరి దర్యాప్తు చేయాలని జగన్ తరపున పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ఎన్ఐఏ కోర్టు కొట్టేసింది. విచారణకు రాలేనని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకు అనుమతి ఇవ్వాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను ఆగస్టు ఒకటికి వాయిదా వేసింది.
విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (Jagan Mohan Reddy) కోడికత్తితో (Kodikatti case) జరిగిన హత్యాయత్నం కేసుపై విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో బుధవారం కూడా విచారణ జరిగింది.