హైదరాబాదీ ఉగ్రవాదులకు 5 ఏళ్ల జైలు
ABN , First Publish Date - 2023-08-26T13:43:11+05:30 IST
హైదరాబాదీ ఉగ్రవాదులు అబ్దుల్ బాసిత్, అబ్దుల్ ఖాదిర్‌లను దోషులుగా తేల్చి 5 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేస్తూ ఎన్ఐఏ ఢిల్లీ కోర్టు తీర్పును వెలువరించింది. 2018లో వీరిద్దరినీ ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.
హైదరాబాద్ : హైదరాబాదీ ఉగ్రవాదులు అబ్దుల్ బాసిత్, అబ్దుల్ ఖాదిర్‌లను దోషులుగా తేల్చి 5 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేస్తూ ఎన్ఐఏ ఢిల్లీ కోర్టు తీర్పును వెలువరించింది. 2018లో వీరిద్దరినీ ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అబుదాబి మాడ్యుల్ ద్వారా పేలుళ్లకు నిందితులు కుట్ర పన్నారు. ఐదేళ్ల జైలు శిక్షతోపాటు ఇద్దరికీ ఎన్ఐఏ కోర్టు రూ.2000 ఫైన్ విధించింది. ఐసిస్ అబుదాబి మాడ్యూల్ కోసం అబ్దుల్ బాసిత్ పని చేశాడు. ఐసీసీ వైపు యూత్ ను ఆకర్షితులను చేసేందుకు యత్నించాడు. మరో ఉగ్రవాది అధ్నాన్ హుస్సేన్ నుంచి బాసిత్ దీనికి నిధులు సమకూర్చాడు. నిధుల ద్వారా యువకులకు వీసా, పాస్ పోర్ట్‌లను బాసిత్ ఏర్పాటు చేశఆడు. 2017లో అబ్దుల్ బాసిత్ ఇంటర్వ్యూ చూసి అబ్దుల్ ఖాదిర్ ఆకర్షితుడయ్యాడు. ఐసిస్ ఐడియాలజీని అబ్దుల్ ఖాదిర్ ప్రమోట్ చేశాడు. అబ్దుల్ బాసిత్ నిర్వహించిన ఐసీసీ ప్రోగ్రామ్స్‌కు అబ్దుల్ ఖాదిర్ హాజరయ్యాడు. 2019లో ఇద్దరిపై సప్లమెంటరీ చార్జ్‌షీట్ దాఖలైంది.