NIA Raids: రాజస్థాన్‌లో ఎన్ఐఏ దాడులు.. 12 మంది అదుపులోకి

ABN , First Publish Date - 2023-09-27T12:51:36+05:30 IST

ఖలిస్తానీ - గ్యాంగ్‌స్టర్ మూకల స్థావరాలే టార్గెట్‌గా జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) రాజస్థాన్(Rajasthan) లో ఇవాళ ఉదయం నుంచి దాడులు నిర్వహిస్తోంది. శ్రీగంగానగర్, హనుమాన్‌గఢ్, జైసల్మేర్, జోధ్‌పూర్, జుంజునుతో సహా ఐవ్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అధికారులు బందోబస్తు నిర్వహించారు.

NIA Raids: రాజస్థాన్‌లో ఎన్ఐఏ దాడులు.. 12 మంది అదుపులోకి

రాజస్థాన్: ఖలిస్తానీ - గ్యాంగ్‌స్టర్ మూకల స్థావరాలే టార్గెట్‌గా జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) రాజస్థాన్(Rajasthan) లో ఇవాళ ఉదయం నుంచి దాడులు నిర్వహిస్తోంది. శ్రీగంగానగర్, హనుమాన్‌గఢ్, జైసల్మేర్, జోధ్‌పూర్, జుంజునుతో సహా ఐవ్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అధికారులు బందోబస్తు నిర్వహించారు. ఐదు జిల్లాల్లో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో ఖలిస్తానీ-గ్యాంగ్‌స్టర్‌ల మూకకు చెందిన 12 మందికి పైగా వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రాజస్థాన్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ATS) డైరెక్టర్ జనరల్ అన్షుమన్ భోమ్లా ఈ దాడుల్ని ధ్రువీకరించారు.


ఈ టాస్క్ పూర్తయ్యాక పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తామని వివరించారు. పట్టుబడిన వారిలో విద్యార్థి సంఘం నాయకుడు ఉన్నాడని అతనితో ఖలిస్తానీలకు పరిచయాలు ఉన్నట్లు చెప్పారు. సూరత్‌గఢ్ (సిటీ), సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనేక ప్రదేశాలు, కెంచియా, శ్రీగంగానగర్ జిల్లాకు చెందిన రాజయ్యసర్, హనుమాన్‌ఘర్‌లోని గోలువాలాలో దాడులు జరిగాయి. జైసల్మేర్ పోలీస్ సూపరింటెండెంట్ వికాస్ సంగ్వాన్ మాట్లాడుతూ 'జిల్లాలోని ఛాయాన్ గ్రామంలో కెనడాకు చెందిన ఖలిస్తానీ గ్రూప్‌తో టచ్ లో ఉన్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఖలిస్థానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నజ్జర్ హత్యలో భారత ఏజెంట్లకు ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన నేపథ్యంలో భారత్, కెనడాల మధ్య కొనసాగుతున్న దౌత్యపరమైన ఉద్రిక్తత నేపథ్యంలో NIA దాడులు జరుగుతున్నాయి.

Updated Date - 2023-09-27T13:16:56+05:30 IST