Home » Parliament
'ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లు'ను డిసెంబర్ 12న కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జమిలీ ఎన్నికల ఆలోచన చరిత్రాత్మకమని ప్రభుత్వం చెబుతోంది. పార్లమెంటు నుంచి స్థానిక సంస్థల వరకూ ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల సమయం, ఖర్చు ఆదా అవుతాయని అంటోంది.
ప్రియాంక గాంధీ ఒక ప్రత్యేక బ్యాగుతో పాలస్తీనాకు తన సంఘీభావం తెలిపినట్టు ఒక నెజిజన్ వ్యాఖ్యానించారు. తూర్పు పాకిస్థాన్‌పై మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాకిస్థాన్ శక్తులను ఓడించిన 'విజయ్ దివస్' రోజు హమాస్ వంటి సంస్థలకు ప్రియాంక మద్దతు చెప్పడం మంచి అభిరుచి కాదని మరొకరు విమర్శించారు.
Debate on Constitution: రాజ్యంగంపై లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా కీలక కామెంట్స్ చేశారు. ఇవి దేశం గర్వపడే లక్షణాలని పేర్కొన్నారు. 75 ఏళ్ల ప్రజాస్వామ్యాన్ని వేడుకగా చేసుకునే క్షణాలివి అని పేర్కొన్నారు.
ఆర్టికల్ 26 దేశ ప్రజలకు మతస్వేచ్ఛ ఉందని చెబుతోందని, మతపరమైన, స్వచ్ఛంద సేవా కార్యకలాపాల కోసం సంస్థలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను ఆ ఆర్టికల్ దేశ ప్రజలకు ఇచ్చిందని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
రాజ్యాంగం తెరిచినప్పుడు అంబేద్కర్, మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ ఆలోచనలు, వారి మాటలు అందులో కనిపిస్తాయని రాహుల్ అన్నారు. మన రాజ్యాంగం ఆలోచనల సమాహారమని, జీవిత తత్వశాస్త్రం, మన సంస్కృతికి సంబంధించిన ఆలోచనలో రాజ్యాంగంలో ప్రతిబింబిస్తాయని చెప్పారు.
తొలి స్పీచ్‌లోనే ప్రియాంక లేవనెత్తిన అంశాలు, ప్రభుత్వాన్ని నిలదీసిన తీరుపై ఆయన సోదరుడు రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. ప్రియాంక సభలో మాట్లాడుతున్నప్పుడు రాహుల్ గాంధీ ఎంతో ఆసక్తిగా విన్నారు.
భారత రాజ్యాంగం 75వ వసంతంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో దీనిపై ప్రత్యేక చర్చలో ప్రియాంక మాట్లాడారు. అదానీ అంశంపై ప్రభుత్వం చర్చించేందుకు భయపడటం వల్లే వ్యూహాత్మకంగా లోక్‌సభను సజావుగా నడవనీయడం లేదని విమర్శించారు.
భారత రాజ్యాంగం ఏక పార్టీ కృషి కాదని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75వ పడిలోకి అడుగుపెట్టిన సందర్భంగా పార్లమెంటులో ప్రత్యేక చర్య జరిగింది. ప్రభుత్వం తరఫున రాజ్‌నాథ్ ఈ చర్చను ప్రారంభించారు.
ప్రధాని నరేంద్ర మోదీ క్యాబినెట్ ఈరోజు కీలక నిర్ణయం తీసుకుంది. 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' బిల్లును ఆమోదించింది. దీంతో త్వరలో ఈ బిల్లు లోక్ సభలో కూడా ప్రవేశపెట్టనున్నారు.
పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ నేతలు వినూత్న రీతిలో నిరసనలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ నేతలు బుధవారంనాడు పార్లమెంటు వెలుపల నిలబడి సభలకు హాజరవుతున్న బీజేపీ నేతలకు త్రివర్ణ పతాకం, గులాబీలు అందించారు.