Home » Phone tapping
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎస్ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్) మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుకు అమెరికాలో గ్రీన్‌కార్డు మంజూరయింది. అమెరికాలో స్థిరపడిన కుటుంబసభ్యుల ద్వారా గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలియవచ్చింది. కొన్ని రోజుల క్రితమే గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరయింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. గత మార్చిలో నమోదైన ఈ కేసులో దర్యాప్తు అధికారులు ఇప్పటికే నలుగురు పోలీసు అధికారులను అరెస్టు చేశారు.
గత ప్రభుత్వంలో తప్పులు చేసిన వారిని నవంబర్ 1వ తేదీ నుంచి 8 తేదీలోపు అరెస్టుల పరంపరం మొదలు కానుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో వెల్లడించారు. ఆ అరెస్టయ్యే వారి జాబితాలో ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన వారు సైతం ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. అలాంటి వేళ.. శుక్రవారం హైదరాబాద్‌లో ఏబీపీ సదరన్ కాన్క్లేవ్లో కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు.
Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు తిరుపతన్న సుప్రీం కోర్టును ఆశ్రయించారు. గురువారం సుప్రీంలో బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ వేశారు. కౌంటర్ దాఖలు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఐదో నిందితుడు రిటైర్డ్ డీసీపీ రాధాకిషన్‌రావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ప్రభుత్వం వివరణ సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏ1 ప్రభాకర్ రావు, ఏ6 శ్రవణ్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఇంటర్ పోల్‌కు సీబీఐ లేక రాసింది. హైదరాబాద్ పోలీసుల విజ్ఞప్తిని సీబీఐ అనుమతించింది.
ఫోన్‌ట్యాపింగ్ కేసులో కీలక నిందితుల్లో ఒకరైన మాజీ అదనపు ఎస్పీ భుజంగరావుపై మరో ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు ఎవరినీ వదిలిపెట్టబోమని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివా్‌సరెడ్డి స్పష్టం చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయని, వాటన్నింటిపై దర్యాప్తు కొనసాగిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. తప్పించుకొని తిరుగుతూ విదేశాల్లో ఉంటున్న నిందితులను పట్టుకుంటామని పేర్కొంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ-3గా ఉన్న మాజీ అదనపు ఎస్పీ భుజంగరావుకు నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.