Home » Phone tapping
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఐదో నిందితుడు రిటైర్డ్ డీసీపీ రాధాకిషన్‌రావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ప్రభుత్వం వివరణ సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏ1 ప్రభాకర్ రావు, ఏ6 శ్రవణ్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఇంటర్ పోల్‌కు సీబీఐ లేక రాసింది. హైదరాబాద్ పోలీసుల విజ్ఞప్తిని సీబీఐ అనుమతించింది.
ఫోన్‌ట్యాపింగ్ కేసులో కీలక నిందితుల్లో ఒకరైన మాజీ అదనపు ఎస్పీ భుజంగరావుపై మరో ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు ఎవరినీ వదిలిపెట్టబోమని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివా్‌సరెడ్డి స్పష్టం చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయని, వాటన్నింటిపై దర్యాప్తు కొనసాగిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. తప్పించుకొని తిరుగుతూ విదేశాల్లో ఉంటున్న నిందితులను పట్టుకుంటామని పేర్కొంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ-3గా ఉన్న మాజీ అదనపు ఎస్పీ భుజంగరావుకు నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Telangana: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు చుక్కుదురైంది. ఈ కేసులో నిందితులు బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు పిటిషన్ విచారణకు రాగా.. నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. అలాగే నలుగురు నిందితుల బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఏ2 ప్రణీత్‌రావు, ఏ3 తిరుపతన్న, ఏ4 భుజంగరావు, ఏ5 రాధాకిషన్‌రావు బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు, మాజీ డీసీపీ(ఓఎస్డీ) రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి.
దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్ల రివకరీలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని డీజీపీ జితేందర్ తెలిపారు. రాష్ట్రంలో ఈ ఏడాదిలో జూలై 25 వరకు 21,193 ఫోన్లను రికవరీ చేసినట్లు ఆయన వివరించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న జుడీషియల్ రిమాండ్‌ను నాంపల్లి కోర్టు జూలై 31 వరకు పొడిగించింది.