Home » Phone tapping
ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారాన్ని సుమోటా పిటిషన్‌గా తెలంగాణ హైకోర్టు స్వీకరించింది. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా హైకోర్టు స్వీకరించింది.
మాజీ సీఎం కేసీఆర్ సూచన మేరకు గత నెల 27న ఎమిరేట్స్ విమానంలో దొంగచాటుగా అమెరికా వెళ్లిన హరీశ్‌రావు.. అక్కడే ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును కలిశారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఇప్పట్లో తెలంగాణకు రావద్దని ఆయనకు చెప్పి వచ్చారని పేర్కొన్నారు.
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు (Harish Rao) ఫోన్ ట్యాపింగ్ కేసులో కొంతమందిని కాపాడటానికి గత సీఎండీ ప్రభాకర్ రావును దొంగచాటుగా అమెరికా వెళ్లి కలిసి వచ్చారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komati Reddy Venkat Reddy) ఆరోపణలు చేశారు. ఈ విషయంపై కోమటిరెడ్డికి హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు.
ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) కేసులో సంచలన విషయాలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komati Reddy Venkat Reddy) బయటపెట్టారు. ఈ కేసు విషయంలో అన్ని విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతో మాజీ మంత్రి హరీష్‌రావు దొంగచాటుగా గత సీఎండీ ప్రభాకర్ రావును అమెరికా వెళ్లి కలిసి వచ్చారని ఆరోపించారు.
క్రియా హెల్త్‌కేర్ ప్రైవేట్ కంపెనీ చీఫ్, వ్యాపారవేత్త చెన్నుపాటి వేణుమాధవ్‌ను అపహరించి, బెదిరించి, బలవంతంగా 40ు వాటా షేర్లను బదిలీ చేయించుకున్న కేసులో.. హైకోర్టు ఇద్దరు నిందితులకు అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఇందిరా పార్క్ వద్ద బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చుతోందని ఆరోపించారు. ధర్నాలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు శుక్రవారం ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయనున్నారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా బీజేపీ నేతలు ధర్నా చేపట్టనున్నారు. పోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
న్యూఢిల్లీ: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర హోంమంత్రికి రాష్ట్ర బీజేపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. తెలంగాణలో బయటపడుతున్న గత ప్రభుత్వ కుంభకోణాలపై సీబీఐతో దర్యాప్తు జరపాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ పార్టీని వరుసగా మూడోసారి అధికారంలోకి తెచ్చేందుకే అప్పటి ఎస్ఐబీ చీఫ్ నేతృత్వంలో తామంతా కలిసి పనిచేసినట్లు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన కీలక నిందితుడు, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ (ఓఎస్డీ) రాధాకిషన్ రావు తన నేరాంగీకార వాంగ్మూలంలో వెల్లడించారు. ‘‘2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు శ్రవణ్ కుమార్ నియోజకవర్గాలవారీగా నిర్వహించిన సర్వేలో.. బీఆర్ఎస్ పార్టీకి 50 సీట్లు కూడా రావని తేలింది.
తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త అంశం బయటకు వస్తోంది. పోలీసుల విచారణలో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కోసం విదేశాల నుంచి పరికరాలు కొనుగోలు చేశారని గతంలో వార్తలు వచ్చాయి. కొన్ని పరికరాలను విదేశాల నుంచి కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.