Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ నిందితులకు 31 వరకు రిమాండ్
ABN , Publish Date - Jul 27 , 2024 | 03:47 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న జుడీషియల్ రిమాండ్‌ను నాంపల్లి కోర్టు జూలై 31 వరకు పొడిగించింది.
ఆలోగా ప్రభాకర్‌రావు, శ్రవణ్ విషయంలో నివేదిక ఇవ్వాలన్న కోర్టు
హైదరాబాద్, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న జుడీషియల్ రిమాండ్‌ను నాంపల్లి కోర్టు జూలై 31 వరకు పొడిగించింది. రిమాండ్ గడువు ముగియడంతో వీరిని దర్యాప్తు అధికారులు శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం నాంపల్లిలోని 12వ ఏసీజేఎం కోర్టు న్యాయమూర్తి ఈశ్వరయ్య నలుగురు నిందితుల రిమాండ్‌ను పొడిగించారు.
దర్యాప్తు అధికారులు చార్జిషీట్‌లో పొందుపర్చిన పత్రాల్లో కొన్నింటిని నిందితులకు ఇవ్వలేదని నిందితుల తరఫు న్యాయవాది కోర్టులో మెమో దాఖలు చేశారు. దీంతో దర్యాప్తు అధికారుల తరఫు న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు. గడువు కావాలని అభ్యర్థించగా తదుపరి విచారణలోగా నివేదిక ఇవ్వాలంటూ విచారణను వాయిదా వేశారు.