Phone Recovery: ఫోన్ల రికవరీలో తెలంగాణది రెండోస్థానం..
ABN , Publish Date - Jul 29 , 2024 | 03:54 AM
దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్ల రివకరీలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని డీజీపీ జితేందర్ తెలిపారు. రాష్ట్రంలో ఈ ఏడాదిలో జూలై 25 వరకు 21,193 ఫోన్లను రికవరీ చేసినట్లు ఆయన వివరించారు.
206 రోజుల్లో 21,193 ఫోన్ల రికవరీ: డీజీపీ
హైదరాబాద్, జూలై 28(ఆంధ్రజ్యోతి): దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్ల రివకరీలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని డీజీపీ జితేందర్ తెలిపారు. రాష్ట్రంలో ఈ ఏడాదిలో జూలై 25 వరకు 21,193 ఫోన్లను రికవరీ చేసినట్లు ఆయన వివరించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(డీవోటీ) ఫోన్ల దొంగతనాలను అరికట్టేందుకు సీఈఐఆర్ పోర్టల్‌ను దేశవ్యాప్తంగా గతేడాది మే 17న అధికారికంగా ప్రారంభించిందని చెప్పారు. అయితే ఈ పోర్టల్ గతేడాది ఏప్రిల్ 19 నుంచే రాష్ట్రంలో ప్రయోగత్మాకంగా అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. 780 పోలీ్‌సస్టేషన్లలో ఈ పోర్టల్‌ను ఉపయోగిస్తున్నామని జితేందర్ చెప్పారు.
తద్వారా ఈ ఏడాది జూలై 25 వరకు 206 రోజుల్లో 21,194 ఫోన్లు రికవరీ చేయగా, గత 8 రోజుల్లోనే 1,000 ఫోన్లను పట్టుకొని ఫిర్యాదుదారులకు అప్పగించామని, సగటున ప్రతిరోజూ 82 ఫోన్లను రికవరీ చేస్తున్నామని తెలిపారు. ప్రత్యేక పోర్టల్ ద్వారా ప్రజలకు మొబైల్ ఫోన్లను అతితక్కువ కాలంలోనే రికవరీ చేస్తున్నందుకు పోలీసు విభాగాలను ఆయన ప్రశంసించారు. పౌరులకు మెరుగైన సేవలు అందించేందుకు టెలికాం శాఖతో కలిసి సీఈఐఆర్ పోర్టల్‌ను తెలంగాణ పోలీస్ సిటిజన్ పోర్టల్‌తో అనుసంధానించినట్లు వెల్లడించారు. పోగొట్టుకున్న, దొంగతనానికి గురైన ఫోన్ల గురించి ఠీఠీఠీ.్టటఞౌజూజీఛ్ఛి.జౌఠి.జీుఽ లేదా ఠీఠీఠీ.ఛ్ఛిజీట.జౌఠి.జీుఽ వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని డీజీపీ సూచించారు.