Phone tapping Case: జూబ్లీహిల్స్ పోలీసుల కస్టడీకి రాధాకిషన్‌రావు
ABN , Publish Date - Jul 17 , 2024 | 12:14 PM
Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును జూబ్లీహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రాధాకిషన్‌రావును రెండు రోజుల పాటు కస్టడీకీ నాంపల్లి కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంచల్‌గూడ జైల్లో ఉన్న ఆయనను జూబ్లీహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మరోవైపు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో మరో కేసు నమోదు అయ్యింది.
హైదరాబాద్, జూలై 17: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone tapping Case) అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును (Former DCP of Task Force Radhakishan Rao) జూబ్లీహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రాధాకిషన్‌రావును రెండు రోజుల పాటు కస్టడీకీ నాంపల్లి కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంచల్‌గూడ జైల్లో ఉన్న ఆయనను జూబ్లీహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మరోవైపు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో మరో కేసు నమోదు అయ్యింది.
Andhra Pradesh: పెద్దిరెడ్డికి బిగ్ షాక్.. కలెక్టర్ కీలక ఆదేశాలు..
నాంపల్లి కోర్టులో పీటీ వారెంట్‌పై పోలీసులు రిమాండ్ చేశారు. యజమానిని కిడ్నాప్ చేసి క్రియా హెల్త్ కేర్ సంస్థలో కోట్ల విలువైన షేర్లను నలుగురు డైరెక్టర్ల మీదకు బలవంతంగా బదిలీ చేయించారని ఫిర్యాదు పేర్కొన్నారు. సంస్థ వ్యవస్థాపకుడు చెన్నుపాటి వేణుమాధవ్ ఫిర్యాదుతో కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలో రాధాకిషన్‌రావుతో పాటు మరో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు సహా చంద్రశేఖర్, కృష్ణ, గోపాల్, రాజ్, రవి, బాలాజీలపై కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు లుక్ అవుట్ నోటీస్ జారీ చేశారు.
మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్‌దే ముఖ్య పాత్ర అని పోలీసులు నిర్ధరాణకు వచ్చిన విషయం తెలిసిందే. కీలకమైన డేటా ధ్వంసంలోనూ ఆయన హస్తం ఉన్నట్లు తేలింది. ప్రైవేటు వ్యక్తుల ఫ్రొఫైళ్లను ఉపయెగించి ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా.. ఆ సమాచారం బయటకు రాకుండా డేటాను ధ్వంసం చేసినట్లు దర్యాప్తు బృందం గుర్తించింది.ఈకేసులో ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నలను అరెస్ట్ చేసిన పోలీసులు రాధాకిషన్‌ను కూడా అదుపులోకి తీసుకుని చంచల్ గూడా జైలుకు పంపిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి...
Jamnagar: అంబానీ కుటుంబానికి సెంటిమెంట్‌గా జామ్‌నగర్.. ప్రత్యేకతేంటి?
Read Latest AP News And Telugu News