Home » Ponguleti Srinivasa Reddy
ఖమ్మం జిల్లాలోని వైరాలో మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
వచ్చే ఏడాది నుంచి చౌక ధర దుకాణాల ద్వారా సన్నం బియ్యం పంపిణీ చేయాలని.. కొత్త తెల్ల రేషన్ కార్డుల జారీ విఽధి విధానాలపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.
ప్రాజెక్టులకు నష్టం వాటిల్లకుండా పూడికతీత పనులు చేపట్టాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది.
ధరణీ అనే భూతంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ధరణిని ప్రక్షాళన చేస్తున్నామని, రైతులకు దాని ద్వారా మోక్షం కల్పిస్తామని అన్నారు. అద్భుతమైన రెవెన్యూ చట్టం తీసుకుని రాబోతున్నామని స్పష్టం చేశారు. 80 వేల పుస్తకాలు చదివిన దొరవారు సూచనలు చేస్తే పరిశీలించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
గత ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రానికి రూ.7.19లక్షల కోట్ల అప్పులున్నాయని, తమ ప్రభుత్వం అసలు, వడ్డీ కింద ప్రతి నెలా సుమారు రూ.6వేల కోట్లు బ్యాంకులకు చెల్లిస్తోందని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనిసవారెడ్డి చెప్పారు.
రాష్ట్రంలోని పేదలకు కొత్త రేషన్ (ఆహార భద్రత) కార్డులు, హెల్త్ కార్డుల జారీకి అవసరమైన విధివిధానాలు, అర్హతల రూపకల్పనపై ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది.
దక్షిణ మధ్య రైల్వే ఖమ్మం, వరంగల్ జిల్లాల మీదుగా ప్రతిపాదించిన నూతన రైలు మార్గాల్లో మార్పులు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేశారు.
వరంగల్ నగర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అధికారులు పని చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy), అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న కొత్త రెవెన్యూ చట్టం.. పేదలు, రైతులకు చుట్టంగా మారనుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. సేవలు సులభంగా, వేగంగా అందడంతో పాటు రెవెన్యూ వ్యవస్థ బలోపేతం అవుతుందని, ఒకరిద్దరి అవసరాలకు కాకుండా భవిష్యత్తు తరాలకూ ఉపయోగపడేలా రికార్డ్ ఆఫ్ రైట్స్(ఆర్వోఆర్) చట్టం-24 ముసాయిదా ఉందని అన్నారు.
ఖమ్మం జిల్లా: నేలకొండపల్లి మండలం, గువ్వలగూడెంలో రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం పర్యటిస్తున్నారు. ఈ సందర్భగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి నూతనంగా నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. విద్య వైద్యకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం చేపట్టిందని చెప్పారు.