Home » Prajwal Revanna
రాసలీలల వివాదంలో చిక్కుకున్న ప్రజ్వల్‌పై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా తమకు అభ్యంతరం లేదు అని జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ తెలిపారు. తన 91వ జన్మదినం సందర్భంగా బెంగళూరులోని వెంకటేశ్వర ఆలయంలో శనివారం పూజలు జరిపించారు.
కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ప్రజల్వ్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మౌనం వీడారు. ఈ కేసులో మరింత మంది ప్రమేయం ఉందనే సంకేతాలిచ్చారు. ఈ కేసులో ఎవరెవరికి ప్రమేయం ఉందో వారందరిపైన చర్యలు తీసుకోవాలన్నారు. అయితే వారి పేర్లు తాను చెప్పదలచుకోలేదన్నారు.
కర్ణాటక రాజకీయాలను ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలు ఓ కుదుపు కుదిపేశాయి. వీడియోలు బయటకు వచ్చేందుకు కారణం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అని బీజేపీ నేత జి దేవరాజే గౌడ సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటకలో కుమారస్వామిని రాజకీయంగా ఫినిష్ చేయాలనేది శివకుమార్ టార్గెట్ అని బాంబ్ పేల్చారు. అందుకోసం తనను సంప్రదించారని వివరించారు.
హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అసభ్యకర వీడియోలతో కూడిన పెన్ డ్రైవ్‌ల వ్యవహారంలో 'సిట్' విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రమేయమున్నట్టు అనుమానిస్తున్న చేతన్, లిఖిత్ అనే ఇద్దరు వ్యక్తులను హసన్‌లో ఆదివారంనాడు అరెస్టు చేసింది.
లోక్‌సభ ఎన్నికల మధ్యలో సంచలనం సృష్టించిన హస్సన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర రాజకీయ పార్టీలు, నేతలకు అదివారంనాడు కీలక సూచనలు చేశారు. కేసు సున్నితత్వం దృష్ట్యా ఎవరూ ఎలాంటి బహిరంగ ప్రకటనలు కాని, సమాచారం షేర్ చేయడం కానీ చేయవద్దని కోరారు.
కర్ణాటకలో కలకలం రేపిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ(Prajval Revanna) సెక్స్ స్కాండల్ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. జాతీయ మహిళా కమిషన్(NWC) గురువారం మాట్లాడుతూ.. ఈ కేసులో ఫిర్యాదు చేసిన మహిళల్లో ఒకరు తనను బెదిరించి రేవణ్ణపై అసత్య ఆరోపణలు చేయించారని తమతో చెప్పినట్లు కమిషన్ తెలిపింది.
లైంగిక వేధింపుల బాధితురాలి అపహరణ కేసులో కర్ణాటక ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణను ఈనెల 14వ తేదీ వరకూ జ్యూడిషయల్ కస్టడీలోకి తీసుకోవాలని స్థానిక కోర్టు బుధవారంనాడు ఆదేశించింది. మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలను హెచ్‌డీ రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ ఎదుర్కొంటుండగా, బాధిత మహిళను అపహరించిన కేసును హెచ్‌డీ రేవణ్ణ ఎదుర్కొంటున్నారు.
జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్) బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసింది. 196 దేశాలతో పాటు, ఇంటర్‌పోల్‌కు సమాచారాన్ని ఇచ్చినట్లు తెలిపింది. ప్రజ్వల్ ఏ దేశంలోనైనా, విమానాశ్రయాలు, ఓడరేవుల్లో కనిపించినా సమాచారం ఇవ్వాలని ఇంటర్‌పోల్‌ను కోరామని పేర్కొంది.
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో(Delhi Liquor Scam Case) కోర్టుకు హాజరైన ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha).. సంచలన కామెంట్స్ చేశారు. కోర్టు హాల్ నుంచి బయటకు వెళ్తూ.. ప్రజ్వల్ రేవన్న(Prajwal Revanna) అంశంపై స్పందించారు. మహిళలపై అఘాయిత్యానికి పాల్పడిన, అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడిన జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వారిని విడిచిపెట్టి.. దేశం దాటించి..
దక్షిణాదిన టార్గెట్-50 అంటున్న బీజేపీకి కర్ణాటక అత్యంత కీలకం. మిగతా ఏ రాష్ట్రంలోనూ రెండంకెల స్కోరు దాటే పరిస్థితి లేని నేపథ్యంలో ఇక్కడ గెలిచే స్థానాలే ముఖ్యం.