Home » Prakasam Barrage
ప్రకాశం బ్యారేజీ దెబ్బతిన్న గేట్ల మరమ్మతులు పూర్తయ్యాయి.. 67, 69, 70 గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ల వద్ద ఇంజనీర్లు మరమ్మతులు పూర్తి చేశారు..
అమరావతి: ప్రకాశం బ్యారేజీపై కుట్రలో మరో కోణం వెలుగు చూసింది. బ్యారేజీ స్లూయిజ్ గేట్ల చైన్లు తొలగించినట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 10 గేట్ల చైన్లు తొలగించడాన్ని చూసి ఇంజనీర్లు ఆశ్చర్యపోయారు. బ్యారేజీకి ఒకవైపు 6, మరోవైపు 4 స్లూయిజ్ గేట్లు ఉంటాయి. బ్యారేజి నీటి మట్టం తగ్గిన సమయంలో గేట్ల కింద ఉన్న వ్యర్థాలను బయటకు పంపేందుకు వాటిని ఆపరేట్ చేస్తారు.
కృష్ణా నది వరద పోటుపై ఉన్న సమయంలోనే ప్రకాశం బ్యారేజీని మూడు ఇనుప బోట్లు ‘కలిసికట్టు’గా ఢీకొట్టడం వెనుక భారీ కుట్ర దాగిఉందా? బ్యారేజీ గేట్లను దెబ్బతీసేందుకే... ఉద్దేశపూర్వకంగా బోట్లను అలా ‘వదిలేశారా?’ ఈ అనుమానాలను బలపరిచే అనేక అంశాలు బయటపడుతున్నాయి. తొలుత ఇది ప్రమాదంగా భావించినప్పటికీ...
Andhrapradesh: ప్రకాశం బ్యారేజీకి బోట్స్ ఢీకొన్న వ్యవహారంపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఇప్పటికే ఉద్దేశపూర్వకంగా బోట్లు వదిలి ప్రకాశం బ్యారేజీని ఢీ కొట్టడం జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో బ్యారేజీని ఢీకొన్న బోట్లు ఎవరివి అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Andhrapradesh: ప్రకాశం బ్యారేజీ బోట్స్ ఢీకొన్న వ్యవహారంలో కుట్ర కోణం దాగి ఉందని.. దానిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ మంత్రి కొల్లు రవ్రీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రకాశం బ్యారేజీలో మరో సిమెంటు దిమ్మె (కౌంటర్ వెయిట్) దెబ్బతిన్నట్లు గుర్తించారు. 67, 68, 69 నంబరు ఖానాలతో పాటు 66వ ఖానా వద్ద ఉన్న దిమ్మె కూడా దెబ్బతిందని.. పగుళ్లు ఉన్నాయని బెకెమ్ కంపెనీ బృందం గురువారం గుర్తించింది.
Andhrapradesh: ప్రకాశం బ్యారేజ్ గేట్ రిపేర్ పనులు ఊపందుకున్నాయి. బోట్లు గుద్దుకోవడం వల్ల ప్రకాశం బ్యారేజీ రెండు గేట్ కౌంటర్ వెయిట్లు డామేజ్ అయ్యాయి. ధ్వంసమైన కౌంటర్ వెయిట్ స్థానంలో వేరే కౌంటర్ వెయిట్లను అధికారులు ఏర్పాటు చేయనున్నారు. విరిగిన కౌంటర్ వెయిట్ బండ్నువెల్డింగ్ చేసి తొలగించేందుకు చర్యలు చేపట్టారు.
Andhrapradesh: ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్లకు అధికారులు మరమ్మతులు చేపట్టారు. నిపుణుల పర్యవేక్షణలో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ప్రకాశం బ్యారేజ్ 67, 69 నెంబర్ గేట్లకు మరమ్మతు పనులు సాగుతున్నాయి. బ్యారేజ్ 69వ గేటు వద్ద పడవ ఢీకొని కౌంటర్ వెయిట్ దెబ్బతిన్న విషయం తెలిసిందే.
విజయవాడ, పరిసర గ్రామాల ప్రజల వెణ్ణులో వణుకు పుట్టించిన బుడమేరుపై ఓ దుష్ప్రచారం బాగా వైరల్ అవుతోంది. బుడమేరుకు మళ్లీ వరద అంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. సృజన స్పందించారు. బుడమేరుకు మళ్లీ వరద అంటూ ..
వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రాజెక్టులకు పెద్దఎత్తున వరదనీరు పోటెత్తింది. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో కొంత మేర నదులు శాంతించాయి. ప్రస్తుతం ప్రాజెక్టుల వద్ద తాజా పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..