Justice NV Ramana: నమ్మకం, విశ్వాసం..
ABN , Publish Date - Mar 25 , 2025 | 04:04 AM
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, కుప్పంలోని పీఈఎస్ వైద్య కళాశాలలో జరిగిన 17వ పట్టభద్రుల దినోత్సవంలో వైద్య, న్యాయ వృత్తుల్లో నమ్మకం మరియు విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ వృత్తుల్లో పొరపాట్లు సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని హెచ్చరించారు.

వైద్యులు, న్యాయవాదులకు ఇవే కీలకం
వీటిని కోల్పోనంత వరకు ఎవరూ వేలె త్తి చూపరు
నిర్వహణలో పొరపాట్లు చేస్తే సమాజానికి చేటు
ఈ వృత్తుల్లో వారు బాధ్యత ఎరిగి వ్యవహరించాలి
మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ.రమణ
కుప్పం, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): నమ్మకం, విశ్వాసం ఆధారంగా వైద్య, న్యాయ వృత్తులు రాణిస్తాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఇవి కోల్పోనంత వరకూ ఆయా వృత్తులను ఎవరూ వేలెత్తి చూపే అవకాశం ఉండదన్నారు. ఈ రెండు వృత్తుల నిర్వహణలో ఏమాత్రం పొరపాటు చోటుచేసుకున్నా సమాజానికి చేటు జరుగుతుందని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని పీఈఎస్ వైద్య కళాశాలలో 17వ పట్టభద్రుల దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ వైద్య, న్యాయ వృత్తుల్లోని వ్యక్తులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ బాధ్యత ఎరిగి వ్యవహరించాలని సూచించారు. వైద్య వృత్తి సేవాధర్మంతో కూడుకున్నదని, మనుషుల జీవన గమ్యాన్ని మార్చగల శక్తి ఈ వృత్తిలో ఉందన్నారు. న్యాయవృత్తిలాగే వైద్య వృత్తి కూడా ఎంతో బాధ్యతతో కూడినదని, ఈ రెండు వృత్తులూ గతి తప్పకుండా చూడడం ఆయా వృత్తుల్లోని వారికి ఎంతో ముఖ్యమని సూచించారు. ప్రజాస్వామ్య ఆరోగ్య విధానాల రూపకల్పనలో యువ వైద్యులు భాగస్వాములు కావాలని జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. సమావేశానికి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేశ్ కృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. ఉత్తమ విద్యార్థిగా (ఎంబీబీఎస్ 2019-20 బ్యాచ్) ఎంపికైన డాక్టర్ ఎ.విజయకుమార్‌ను స్వర్ణ పతకంతో సత్కరించారు. అలాగే 145మంది ఎంబీబీఎస్ (యూజీ), 84మంది పీజీ విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. గౌరవ అతిథిగా పీఈఎస్ మాజీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కృష్ణ ,ఇన్‌చార్జి డీన్, ప్రిన్సిపాల్ డాక్టర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
YCP: భయం గుప్పెట్లో.. విశాఖ వైసీపీ
Mayor Suresh Babu: కడప గడ్డపై వైసీపీ షాక్
Bridesmaid Package: వివాహానికి ఆహ్వానించి.. అంతలోనే షాక్ ఇచ్చిన స్నేహితురాలు
Cell Phones: పిల్లలను సెల్ ఫోన్‌కు దూరంగా ఉంచాలంటే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..
T Congress Leaders: ఢిల్లీ చేరుకున్న కాంగ్రెస్ నేతలు.. కేబినెట్ కూర్పుపై కసరత్తు
For National News And Telugu News