Home » Prakasam Barrage
Andhrapradesh: భారీ వర్షాలు, వరదలతో రెండు రోజులుగా ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ కాస్తశాంతించింది. గత రాత్రి నుంచి ప్రకాశం బ్యారేజి వద్ద వరద ప్రవాహం క్రమ క్రమంగా తగ్గుతూ వస్తోంది. 11 లక్షల 40 వేల నుంచి గంట గంటకు తగ్గుతూ వరద తాకిడి తగ్గుముఖం పడుతోంది. ఈరోజు (మంగళవారం) ఉదయం 8 లక్షల 94 వేలకు వరద చేరుకుంది.
బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా కురుస్తున్న వర్షాలకు నిన్న(సోమవారం) విజయవాడ ప్రకాశం బ్యారేజీకి రికార్డుస్థాయి వరదనీరు చేరింది. ఎన్నడూ లేనంతగా 11.47లక్షల క్యూసెక్కుల నీరు చేరడంతో ఇదే రికార్డుస్థాయి వరద అంటూ జలవనరుల శాఖ, సీఎంవో కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపాయి. అయితే ఇవాళ వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టింది.
ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షానికి ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage) రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరుతోంది. దీంతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చిన పరిస్థితి. ఈ వరద ఉధృతిలో పెద్ద ఎత్తున బోట్లు కొట్టుకొస్తున్నాయి. తొలుత ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీ వైపు ఒక బోటు కొట్టుకొచ్చింది...