Home » Priyanka Gandhi
వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ లోక్సభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. తల్లి సోనియా, సోదరుడు రాహుల్తో కలిసి సభకు చేరుకున్నారు. ఇటివల ఎన్నికల్లో ప్రియాంక 4 లక్షలకు పైగా ఓట్లతో విజయం సాధించారు.
అన్న రాహుల్ గాంధీని వరుసగా రెండుసార్లు గెలిపించిన వయనాడ్ ప్రజలు.. ఇప్పుడు ఉప ఎన్నికలో చెల్లెలు ప్రియాంకా గాంధీకి భారీ విజయం
కేరళ రాష్ట్రం వయనాడ్ లోక్ సభ నియోజకవర్గ ఉపఎన్నికల ఫలితాల్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా భారీ మెజార్టీతో దూసుకుపోతున్నారు. ఏకంగా నాలుగు లక్షల ఓట్ల ఆధిక్యంతో ఆమె ముందంజలో ఉన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వయనాడ్ లోక్సభ స్థానంలో పోటీ చేసిన స్థానానికి ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ పోటీలో ప్రియాంక గాంధీ భారీ విజయం దిశగా దూసుకుపోతున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
వయనాడ్ రూరల్ ఏరియాలో ఉదయం నుంచి పోలింగ్ బూత్లకు ఓటర్లు పెద్దసంఖ్యలో తరలిరాగా, అర్బన్ ప్రాంతాల్లో కాస్త మందకొడిగా పోలింగ్ మైదలైంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ యూడీఎఫ్ అభ్యర్థిగా తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు.
వయనాడ్ ఎంపీ స్థానానికి ఈ నెల 13న జరగనున్న ఉప ఎన్నికలో పోటీ పడుతున్న 16 మంది అభ్యర్థుల్లో ఏకంగా 11 మంది రాష్ట్రేతరులే కావడం విశేషం. వీరిలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎన్నికల అరంగేట్రం చేస్తున్నారు.
ప్రధాని మోదీ అంటేనే బోర్ కొడుతోందని, ఆయన ప్రస్తావన ఎందుకని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
ప్రియాంకను గెలిపిస్తే వయనాడ్కు ఉత్తమ ఎంపీ ఆమె అవుతుందని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆమె ప్రజల జీవితాలను ఎలా మెరుగుపరచారని, ఫుడ్ ప్రాసెసింగ్, స్టోరేజ్, పర్యాటకం, మౌలిక వసతుల కల్పన వంటి రంగాలపై తగిన ప్రణాళికలపై దృష్టి సారించిందని చెప్పారు.
ప్రజలను విడగొట్టడం, విద్వేష వ్యాప్తి, ప్రజాస్వా్మిక సంస్థలను నీరుగార్చడం ద్వారా అధికారంలో కొనసాగడమే మోదీ సర్కార్ లక్ష్యమని వయనాడ్లో ఆదివారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రియాంక గాంధీ అన్నారు.
వయనాడ్ ప్రజాసమస్యలపై గట్టిగా గళం విప్పుతానని ఆ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ ప్రజలకు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చుంగ్థారాలో మంగళవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు.