Home » Raptadu
మండల కేంద్రం సమీపంలో ఉన్న ఆటో నగర్లో సమస్యలు తిష్ట వేశాయి. ప్రధాన రోడ్లు, లింక్ రోడ్లు అద్వానంగా ఉన్నాయి. భారీ గుంతలు ఏర్పడటంతో వర్షపు నీరు ఎక్కువగా నిలిచి బురదమయంగా మారుతున్నాయి. ద్విచక్రవాహనాలతో పాటూ ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆటో నగర్లో చాలా వరకు వీధిలైట్లు కూడా లేకపోవడంతో చీకటి మయం గా ఉంది.
రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఆ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే పరిటాల సునీత తీ వ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ గు రువారం అనంతపురం నగరంలోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మా ట్లాడారు. గతంలో చెన్నేకొత్తపల్లి, రామ గిరి, రాప్తాడు మండలాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయన్నారు.
మండలంలో జరిగిన ఉపాధి పనుల్లో రూ 2,07,159 అవినీతి జరిగిందని సామాజిక తనిఖీబృందం సభ్యులు తేల్చారు. స్థానిక ఎంపీడీ ఓ కార్యాలయం ఆవరణలో బుధవారం సామాజిక తనిఖీ బహిరంగ ప్రజావేదిక నిర్వహించారు. డ్వామాపీడీ విజ యేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో అధికారులు పంచాయతీల వారీగా తనిఖీల వివరాలను వెల్లడించారు.
ప్రజాసమస్యలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల తో ఎమ్మెల్యే పరిటాలసునీత సోమవా రం బిజీబిజీగా గడిపారు. భక్త కనకదాస జయంతి వేడుకలను వెంకటాపురం గ్రామంలో కరుబలు నిర్వహించగా, ఆమె జ్యోతుల ఊరేగింపులో పాల్గొన్నారు. కనకదాస చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు.
టీడీపీ సభ్యత్వ నమోదులో రాప్తాడు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఐదో స్థానంలో నిలపాలని టీడీపీ నాయకులు, కార్య కర్తలకు ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపు నిచ్చారు. మండలంలోని ముత్యాలం పల్లిలో ఆదివారం ఆమె సభ్యత్వనమోదు గురించి గ్రామస్థులకు తెలియజేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు సం క్రాంతి కానుకగా కొత్త పింఛన్లు, రేషనకార్డులు అందజేస్తారని ఎమ్మెల్యే పరి టాల సునీత తెలిపారు. నియోజవర్గ కేంద్రమైన రాప్తాడులో శనివారం ఎ మ్మెల్యే లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన గోకులం షెడ్లను అధికారులతో కలిసి ప్రా రంభించా రు.
మండలపరిధిలోని ఉప్పరపల్లి సమీపంలో అంగనవాడీలకు ఇచ్చి న ఇళ్ల స్థలాల్లో ఫెన్సింగ్ వేయడానికి కొందరు శుక్రవారం ప్రయత్నించారు. దానిని సంబంధి త అంగనవాడీలు అడ్డుకున్నారు. విషయం తె లుసుకున్న పోలీసులు ఇరు వర్గాలను తహసీల్దార్ వద్దకు వెళ్లి నచ్చచెప్పి పంపివే శారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామీణ రోడ్డు నిర్లక్ష్యాని గురయ్యా యి. కొన్నింటికి నిధులు మంజూరైనా ప్రజా ప్రతిని ధులు తారురోడ్లు వేయలేకపోయారు. దీంతో ఆ గ్రా మాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడా ్డరు. కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే తారు రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూ రు చేసి, పనులు ప్రారంభించడంతో గ్రామీణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మండలంలోని హంపాపురం సమీపం లో ఉన్న మౌనగిరి హనుమన క్షేత్రాన్ని పర్యాటకంగా అభివృద్ది చేస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత, టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ తెలిపారు. మౌనగిరి క్షేత్రం ఏడో వార్షికోత్సవం సందర్బంగా పరిటాల కుటుంబ సభ్యులు అక్కడి ఏకశిలా ఆంజనేయస్వామి విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే పరిటాల సునీతతో పాటూ పరిటాల శ్రీరామ్, పరిటాల జ్ఞాన దంపతులు స్వామి వారికి పట్టు వసా్త్రలు సమర్పించారు.
టీడీపీ సభ్యత్వ నమోదును ప్రతి ఒక్కరు బాధ్యాతగా తీసుకోవాలని ఎమ్మెల్యే పరిటాలసునీత సూచించారు. నిర్దేశించిన సమయంలోగా లక్ష్యాన్ని పూర్తీ చేసి రాప్తాడు నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలపాలన్నారు. మండలాలలో చేపట్టిన సభ్యత్వ ప్రక్రియపై ఆమె శనివారం టీడీపీ చెన్నేకొత్తపల్లి, రామగిరి కార్యాలయాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాలు, బూతల వారీగా సభ్యత్వ నమోదు వివరాలను తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ...నియోజకవర్గంలో చెన్నేకొత్తప ల్లి, రామగిరి మండలాలు వెనుకంజలో ఉన్నాయన్నారు.