Home » Revanth Reddy
భారీ వర్షాల కారణంగా తలెత్తిన వరదల సమయంలో సహాయక చర్యలు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. ‘‘ఉదయం నుంచి సాయంత్రం దాకా వరదలో రాణి గారు, వారి ముగ్గురు పిల్లలు చిక్కుకుంటే ప్రభుత్వం స్పందించదు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పాటు చేసిన హైడ్రా ఎంతలా సంచలనం సృష్టిస్తోందో అందరికీ తెలిసిందే. చెరువులు, నాలాలను ఆక్రమించి నిర్మించిన భవనాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. రాజకీయ నాయకుల నుంచి సినీ సెలబ్రిటీల వరకు ఎవరికి సంబంధించిన అక్రమ నిర్మాణాలనైనా వదలడం లేదు.
తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. వరదలు ముంచెత్తున్నాయి. దాదాపు చెరువులన్నీ నిండిపోగా.. నదులు, వాగులు, వంకలు వరదలతో ఉప్పొంగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించారు.
ప్రభుత్వం మొద్ద నిద్ర వీడి విద్యా వ్యవస్థలో సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.
యాదగిరిగుట్ట అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిలో పెండింగ్ పనులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు.
మహా నగరం హైదరాబాద్లో చెరువులను ఆక్రమించి చట్టవిరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిణామం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కీలక ప్రకటన చేశారు. తన ఇల్లు చట్టవిరుద్ధంగా ఉంటే కూల్చివేయాలని అన్నారు.
ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే కవితకు బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేంద్రంలోని అధికార బీజేపీ మధ్య డీల్ కుదరడంతోనే బెయిల్ వచ్చిందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్ట్ స్పందించింది.
హైదరాబాద్ మహానగరంలో హైడ్రా కూల్చివేతలపై రాజకీయ ప్రకంపనలు రేగుతున్న వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఎప్పటికీ వెనక్కి తగ్గదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తర మొదటి ప్రాధాన్యత చెరువులను కాపాడటమేనని, పార్టీలతో సంబంధం లేదని, హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతుందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో డెంగ్యూ, ఇతర జ్వరాలకు సంబంధించిన మరణాల లెక్కలను దాస్తున్నారంటూ విపక్ష బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సీజనల్ వ్యాధుల విషయంలో అధికారుల పనితీరుపై ఆయన సీరియస్ అయ్యారు.
కాంగ్రెస్ పీసీసీ చీఫ్గా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారైందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడకపోయినా.. కాంగ్రెస్ వర్గాల్లో సైతం జోరుగా చర్చ జరుగుతోంది.