Home » Rohit Sharma
స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత జట్టు వైట్‌వాష్‌కు గురికావడం 24 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరిసారి, 2000లో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా ఒక్కటీ గెలవలేకపోయింది. రెండింట్లోనూ ఓడి వైట్‌వాష్‌కు గురైంది. ఆ సమయంలో సచిన్ టెండూల్కర్ కెప్టెన్‌గా ఉన్నాడు.
Rohit-Virat: కోచ్ గంభీర్ వ్యూహాలు ఫలించలేదు. రోహిత్ స్ట్రాటజీలు వర్కౌట్ కాలేదు. కోహ్లీ సీనియారిటీ కూడా కాపాడలేదు. న్యూజిలాండ్ చేతుల్లో భారత్‌కు మరో పరాభవం ఎదురైంది. హ్యాట్రిక్ ఓటములతో సొంతగడ్డపై వైట్‌వాష్ అయింది మెన్ ఇన్ బ్లూ.
Rohit Sharma: టీమిండియా మరో అవమానకర ఓటమిని మూటగట్టుకుంది. న్యూజిలాండ్ చేతుల్లో ఆఖరి టెస్ట్‌లోనూ ఓడి వైట్‌వాష్ అయింది. ఈ నేపథ్యంలో జట్టు సారథి రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తప్పంతా తనదేనని అన్నాడు.
IND vs NZ: అభిమానుల అంచనాలు తలకిందులు అయ్యాయి. మూడో టెస్ట్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకుంటుందంటే అది సాధ్యం కాలేదు. హ్యాట్రిక్ ఓటములతో కివీస్ చేతిలో రోహిత్ సేన వైట్‌వాష్ అయింది.
టీమిండియా 4 వికెట్లు కోల్పోయింది. ఇందులో విరాట్ కోహ్లీ రనౌట్ కావడం ప్రేక్షకులను తీవ్ర నిరాశపరిచింది.
ఐపీఎల్ 2025 కోసం ముంబై ఇండియన్స్ జట్టులో భారత జట్టు ఆటగాళ్లను కొనసాగించడాన్ని రోహిత్ శర్మ సమర్ధించాడు. ఇక తన పేరు టాప్-3 రిటెయిన్ జాబితాలో లేకపోవడంపై హిట్‌మ్యాన్ ఆసక్తికరంగా స్పందించాడు.
భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య మూడవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ ఇప్పటికే 0-2 తేడాతో కోల్పోయింది. ఇక సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని కివీస్ ఉవ్విళ్లూరుతుండగా.. చివరి మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని టీమిండియా యోచిస్తోంది. ఈ మ్యాచ్‌కు తుది జట్లు ఇలా ఉన్నాయి.
న్యూజిలాండ్ చేతిలో రెండు మ్యాచుల్లో ఓడి గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటున్న టీమిండియా మరోసారి తలపడనుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాంఖడే పిచ్ ఎలా వ్యవహరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
టీమిండియాను ఓడించిన న్యూజిలాండ్ భారత్‌లో తన మొదటి టెస్ట్ సిరీస్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. జట్టు కెప్టెన్ రోహిత్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ మాజీ క్రికెట్ దిగ్గజం అతడిపై కీలక వ్యాఖ్యలు చేశాడు.
దాదాపు పన్నెండేళ్ల తర్వాత సొంత గడ్డపై టీమిండియా టెస్ట్ సిరీస్ కోల్పోయింది. స్వదేశంలో తిరుగు లేని జట్టుగా ఆధిపత్యం చెలాయించే భారత్‌కు ఇది చాలా పెద్ద షాక్. బ్యాటర్లు దారుణంగా విఫలం కావడంతో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా రెండు టెస్ట్‌ల్లో పరాజయం పాలై సిరీస్‌ను కోల్పోయింది.