ఈ వారం వివిధ కార్యక్రమాలు 24 03 2025
ABN , Publish Date - Mar 24 , 2025 | 03:12 AM
పతంజలి పురస్కార ప్రదానం, కథల పోటీ...

పతంజలి పురస్కార ప్రదానం
స్వర్గీయ కె.ఎన్.వై. పతంజలి 73వ జయంతి సందర్భంగా పతంజలి సాంస్కృతిక వేదిక అందించే పురస్కారాన్ని 2025 సంవత్సరానికి గాను పాత్రికేయుడు, రచయిత తాడి ప్రకాష్ స్వీకరిస్తారు. మార్చి 29 సాయంత్రం విజయనగరం లోని గురజాడ గ్రంథాలయంలో ఈ పురస్కార ప్రదానం జరుగుతుంది.
భీశెట్టి బాబ్జి
కథల పోటీ
వాసా ప్రభావతి స్మారక కథల పోటీకి ఏదైనా సామాజిక అంశానికి సంబంధించిన కథలు పంపాలి. రాతప్రతిలో ఎ4 సైజులో నాలుగు పేజీలకు, డిటిపి రెండు పేజీలకు మించరాదు. ప్రథమ, ద్వితీయ బహుమతులు వరుసగా: రూ.5000, రూ.2500. ఐదు ప్రత్యేక బహుమతులు రూ.1000. కథలు పోస్ట్/ కొరియర్ ద్వారా మాత్రమే ఏప్రిల్ 30 లోగా పంపాలి. చిరునామా: సాహితీ కిరణం, ఇం.నెం.11–13–154, అలకాపురి, రోడ్‌నెం.3, హైదరాబాద్–500102. మరిన్ని వివరాలకు: 94907 51681.
పొత్తూరి సుబ్బారావు