Home » Samajwadi Party
వక్ఫ్ చట్టంలో పలు సవరణలకు కేంద్ర సమయాత్తమవుతుండటంపై ఉత్తప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. వక్ఫ్ బోర్డుల అపరిమిత అధికారాలకు కళ్లెం వేస్తూ "వక్స్ లా-1995'ను సవరిచేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను తమ పార్టీ వ్యతిరేకిస్తుందని తెలిపారు. ముస్లింల హక్కులను హరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
అయోధ్యలో పన్నెండేళ్ల మైనర్ బాలికపై ఆత్యాచార ఉదంతం వెలుగుచూడటంతో బాధితురాలి కుటుంబాన్ని బీజేపీ ప్రతినిధి బృందం ఆదివారంనాడు పరామర్శించింది. అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో సమాజ్‌వాదీ పార్టీ నేత ఒకరు ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి.
ఉత్తరప్రదేశ్ సమాజ్‌వాద్ పార్టీ జౌన్‌పుర్ ఎంపీ బాబు సింగ్ కుష్వాహపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చర్యలకు దిగింది. లక్నోలోని కాన్పూర్ రోడ్డులోని స్కూటర్ ఇండియాలో కోట్లు విలువచేసే భూమిని స్వాధీనం చేసుకుంది. ఈడీ బృందం బుల్డోజర్‌ను రప్పించి ఆ భూమిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చేసింది.
నరేంద్ర మోదీ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్టా పైకప్పు నుంచి వర్షపు నీరు లీక్ కావడంపై విపక్షాలు మండిపడ్డాయి. ఆ క్రమంలో అందుకు సంబంధంచిన వీడియోలను ఆ యా పార్టీల నేతలు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వంపై వారంతా విమర్శలు గుప్పించారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా సమాజవాదీ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే మాతా ప్రసాద్ పాండేను ఆ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. అయితే ఇప్పటి వరకు యూపీ అసెంబ్లీలో సమాజవాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రతిపక్ష నేతగా వ్యవహించారు. అయితే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కనౌజ్ నుంచి ఎంపీగా అఖిలేష్ యాదవ్ ఎన్నికయ్యారు.
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ఫలితాలు సమాజ్‌వాదీ పార్టీకి సంతోషానిచ్చాయి. వూహించినదానికంటే ఎక్కువ సీట్లు రావడం, బీజేపీ బలంగా ఉన్నచోట్ల ఓడిపోవడంతో కమలం బలం తగ్గుతుందని.. ఎస్పీ బలం పెరుగుతుందనే అంచనాకు అఖిలేష్ యాదవ్ వచ్చినట్లు తెలుస్తోంది.
భారతీయ జనతా పార్టీ (BJP)పై సమాజ్ వాదీ పార్టీ (SP) అధినేత అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. బయటి వ్యక్తులు అయోధ్యకు వచ్చి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని, లాభాలు పొందడానికే ఇదంతా చేశారని ఆరోపించారు. ఇతర ప్రాంతాల వ్యక్తులు అయోధ్యలో భూమి కొనడంవల్ల స్థానికులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదన్నారు.
లోక్‌సభ సమావేశాలు ఏడో రోజు ప్రారంభం కాగానే.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని స్పీకర్ ఓంబిర్లా కొనసాగించారు. సోమవారం వివిధ పార్టీల ఎంపీలు మాట్లాడగా.. మిగిలిన చర్చను ఇవాళ కొనసాగించారు.
వారణాసిలోని సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi Party) నాయకుడు, మాజీ కార్పొరేటర్ విజయ్ యాదవ్ నివాసం వద్ద ఆదివారం జరిగిన కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో ఆరేళ్ల చిన్నారి సహా ఆరుగురు గాయపడ్డారు.
లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవికి సమాజ్‌వాదీపార్టీ ఎంపీ అవధేశ్ ప్రసాద్‌ను తమ అభ్యర్థిగా బరిలో నిలపాలని విపక్ష ఇండియా కూటమి భావిస్తున్నట్లు సమాచారం.