Sonia Gandhi: ప్రజా సంక్షేమానికి పునరంకితం కండి
ABN , Publish Date - Apr 04 , 2025 | 04:12 AM
ప్రజా సంక్షేమానికి పునరంకితం కావాలని కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సూచించారు.

రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సోనియా, రాహుల్ సూచన
న్యూఢిల్లీ, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమానికి పునరంకితం కావాలని కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సూచించారు. గురువారం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ నేతృత్వంలో కాంగ్రెస్ నేతల బృందం పార్లమెంట్‌లో వారిని మర్యాదపూర్వకంగా కలిసింది.
ఈ బృందంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖా, ఎంపీలు కిరణ్ కుమార్ రెడ్డి, గడ్డం వంశీ. కావ్య, అనిల్, విప్ లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్ జంతర్ మంతర్‌లో బీసీ సంఘాల నేతృత్వంలో జరిగిన ’బీసీల పోరు గర్జన‘ సభ విషయాలను సోనియా, రాహుల్ లకు మహేశ్ కుమార్ వివరించారు.