Home » Suryakumar Yadav
Team India: మెగా టోర్నీ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతోనే ఐదు టీ20ల సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే ఈ సిరీస్ కోసం టీమిండియాకు కొత్త కెప్టెన్ రాబోతున్నాడు. రెగ్యులర్ టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్య గాయపడటంతో అతడి స్థానంలో కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సూర్యకుమార్ యాదవ్‌ను నియమించనున్నట్లు సమాచారం.
వన్డే ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న భారత జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో కివీస్‌తో టీమిండియా తలపడనుంది. టేబుల్ టాపర్లుగా ఉన్న రెండు జట్ల మధ్య పోటీ కావడంతో మ్యాచ్‌పై అత్యంత ఆసక్తి నెలకొంది.
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఫోర్లు, సిక్సులతో పరుగుల వరద పారించారు. దాదాపు ప్రతి బ్యాటర్ సిక్సులు బాదాడు.
భారత్, ఆస్ట్రేలియా రెండో వన్డే మ్యాచ్‌ను వరుణుడు మరోసారి అడ్డుకున్నాడు. భారత్ విసిరిన 400 పరుగుల కొండంత లక్ష్య చేధనలో భాగంగా ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తుండగా వర్షం వచ్చింది.
సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో ఫామ్‌లోకి వచ్చేశాడు. ఇంతకాలం తన 360 డిగ్రీస్ ఆట అంతా టీ20లకే పరిమితం చేసిన సూర్య తాజాగా వన్డేల్లోనూ చెలరేగుతున్నాడు. వరుసగా రెండు వన్డేల్లో హాఫ్ సెంచరీలు చేశాడు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు పరుగుల వరద పారించారు. బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై ఆకాశమే హద్దుగా చెలరేగిన భారత ఆటగాళ్లు సునాయసంగా సెంచరీలు, హాఫ్ సెంచరీలతో రెచ్చిపోయారు.
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లోనూ తన సూపర్ ఫామ్‌ను కొనసాగించిన టీమిండియా యువ ఓపెనర్ శుభమన్ గిల్ సెంచరీతో చెలరేగాడు. 97 బంతులు ఎదుర్కొన్న గిల్ 6 ఫోర్లు, 4 సిక్సులతో 104 పరుగులు చేశాడు.
అంతర్జాతీయ కెరీర్లో సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు 26 వన్డేలు ఆడి 511 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ కేవలం 24.33. అతడి ఖాతాలో రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. అత్యధిక స్కోరు 64. అంతేకాకుండా సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఆడిన మూడు వన్డేల సిరీస్‌లో వరుసగా హ్యాట్రిక్ డకౌట్లను సాధించాడు. దీంతో ప్రపంచకప్ జట్టులో డకౌట్ స్టార్ అవసరమా అని సోషల్ మీడియా వేదికగా పలువురు క్రికెట్ అభిమానులు బీసీసీఐ తీరుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
కీలకమైన ఐదో టీ20లో భారత బ్యాటర్ల తడబడ్డారు. సూర్యకుమార్ యాదవ్(61) మినహా ఇతర బ్యాటర్లెవరూ రాణించకపోవడంతో వెస్టిండీస్ ముందు టీమిండియా 166 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని ఉంచగలిగింది.
భారత్, వెస్టిండీస్ మధ్య మంగళవారం మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచి 2-0తో అధిక్యంలో ఉన్న విండీస్ మూడో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు భారత జట్టుకు మాత్రం ఈ మ్యాచ్ డూ ఆర్ డైగా మారింది.