Share News

Maharashtra: 'మహా' సర్కార్ కొలువుతీరేందుకు ముహూర్తం ఫిక్స్

ABN , Publish Date - Dec 04 , 2024 | 06:40 PM

మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా దేవేంద్ర ఫడ్నవిస్ తమ కూటమి భాగస్వామ్య పార్టీ నేతలైన ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌తో కలిసి గవర్నర్‌ను కోరిన కొద్దిసేపటికే ఆయన గ్రీన్‌సిగ్నిల్ ఇచ్చారు.

Maharashtra: 'మహా' సర్కార్ కొలువుతీరేందుకు ముహూర్తం ఫిక్స్

ముంబై: మహారాష్ట్ర (Maharashtra)లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ సారథ్యంలోని 'మహాయుతి' కూటమిని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) ఆహ్వానించారు. ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా దేవేంద్ర ఫడ్నవిస్ తమ కూటమి భాగస్వామ్య పార్టీ నేతలైన ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌తో కలిసి గవర్నర్‌ను కోరిన కొద్దిసేపటికే ఆయన గ్రీన్‌సిగ్నిల్ ఇచ్చారు. డిసెంబర్ 5వ తేదీ గురువారం సాయంత్రం 5.30 గంటలకు ప్రమాణస్వీకారం ఉంటుందని గవర్నర్‌తో సమావేశానంతరం ఫడ్నవిస్ మీడియా సంయుక్త సమావేశంలో తెలిపారు. ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌తో కూడా పాల్గొన్నారు.

Devendra Fadnavis: ప్రభుత్వంలో ఉండేందుకు షిండే అంగీకరించారు: ఫడ్నవిస్


''గవర్నర్‌ను మేము కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మద్దతు లేఖలను అందజేశాం. మహాయుతి కూటమి ముఖ్యమంత్రిగా నేను ప్రమాణస్వీకార చేసేందుకు మా భాగస్వామ్య పార్టీలైన శివసేన, ఎన్‌సీపీ మద్దతు లేఖలు ఇచ్చాయి. గవర్నర్ మా విజ్ఞప్తులను ఆలకించి గురువారం మధ్యాహ్నం 5.30 గంటలకు ప్రమాణస్వీకారానికి మమ్మల్ని ఆహ్వానించారు'' అని ఫడ్నవిస్ తెలిపారు.


సీఎం పోస్టుకు తన పేరును సిఫారసు చేస్తూ ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌లు గవర్నర్‌కు లేఖలు అందజేసినట్టు కూడా ఫఢ్నవిస్ తెలిపారు. తమతో ఉన్న ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు సైతం మద్దతు లేఖలు ఇచ్చినట్టు చెప్పారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి పదవులు కేవలం సాంకేతక పరమైన పదవులేనని, మహారాష్ట్ర కోసం తామంతా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు. తదుపరి సమావేశంలో ఇతర మంత్రులెవరనేది నిర్ణయిస్తామని తెలిపారు.


ఇవి కూడా చదవండి

Sukhbir Singh Badal: సుఖ్‌బీర్‌పై కాల్పులు జరిపిందెవరంటే

Uttarakhand: ఆ గంగాజలం స్నానానికి తప్ప తాగడానికి పనికిరాదు: పీసీబీ

Rahul Gandhi: ఘాజీపూర్ సరిహద్దుకు చేరుకున్న రాహుల్, ప్రియాంక గాంధీ

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Dec 04 , 2024 | 06:41 PM