Donald Trumph: ట్రంప్ ప్రమాణస్వీకారం వేదిక మార్పు.. 40 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి
ABN , Publish Date - Jan 19 , 2025 | 08:37 PM
ట్రంప్ ప్రమాణస్వీకార చారిత్రక ఘట్టంలో పాల్గొనేందుకు క్యాపిటల్ హిల్‌లోని రొటుండా ఇండోర్ ఆవరణకు ప్రంపంచ దేశాధినేతలు, ముఖ్య అతిథులు, టెక్ జెయింట్స్ చేరుకుంటున్నారు.

వాషింగ్టన్: ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఘట్టం మరికొద్ది గంటల్లోనే ఆవిష్కృతం కానుంది. అమెరికా 47వ అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trumph) సోమమవారం మధ్యాహ్నం 12.05 గంటలకు అధికారికంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ చారిత్రక ఘట్టంలో పాల్గొనేందుకు క్యాపిటల్ హిల్‌లోని రొటుండా ఇండోర్ ఆవరణకు ప్రంపంచ దేశాధినేతలు, ముఖ్య అతిథులు, టెక్ జెయింట్స్ చేరుకుంటున్నారు. ట్రంప్, ఆయన సతీమణి మెలానియా, కుమారుడు బారన్ ఆదివారం ఉదయం డల్లాస్ అంతర్జాతీయ వేదకతో చేరుకోవడంతో ఉత్సవం సంబరం ఒక్కసారిగా ఊపందుకుంది.
Joe Biden: మాదక ద్రవ్యాల కేసులో 2500 మందికి క్షమాభిక్ష!
40 ఏళ్ల తర్వాత వేదిక మార్పు
సహజంగా అమెరికా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారానికి సహజం క్యాపిటల్ భవనం పశ్చిమ భాగంలోని నేషనల్ మాల్, జాతీయ చిహ్నాల ఎదుట వేలాది మంది సమక్షంలో ప్రమాణస్వీకారం జరపడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి చలితీవ్రత ఎక్కువగా ఉండటంతో క్యాపిటల్ భవనం లోపల ఉండే రొటుండా సముదాయంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గతంలో రోనాల్డ్ రీగన్ చలి కారణంగా రొటుండాలో ప్రమాణస్వీకారం చేశారు. 40 ఏళ్ల తర్వాత ట్రంప్ ఇదే వేదకను చివరి నిమషంలో ఎంచgకున్నారు. ట్రంప్ ప్రకటనకు ముందే 2,20,000 టిక్కెట్లు పంచారు. అయితే కేపిటల్ రొటుండాలో 600 మందికి మాత్రమే వసతికి అవకాశం ఉంది. అయితే కెపిటల్ వన్ స్పోర్ట్ ఎరీనా నుంచి లైఫ్ వీడ్‌ను తన మద్దతుదారులు తిలకించవచ్చని ట్రంప్ తెలిపారు. ఇక్కడ నుంచి ట్రంప్ ప్రమాణస్వీకార వేడుకను 20,000 మంది వరకూ వీక్షించే అవకాశం ఉంటుంది. వీక్షకులందరికీ అందరికీ ఇది అత్యద్భుతమైన అనూభూతినిస్తుందని ట్రంప్ తెలిపారు.
అతిథులుగా హేమాహేమీలు
ట్రంప్ ప్రమాణస్వీకారానికి హేమాహేమీల్లాంటి అతిథులు హాజరవుతున్నారు. టెక్ జెయిట్స్ బిలియనీర్ ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకెర్‌బర్గ్, చైనా సోషల్ మీడియా జెయింట్ టిక్‌టాక్ హెడ్ షౌ చ్యూ, భారత్ నుంచి రిలయెన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన సతీమణి హాజరవుతున్నారు.
అమెరికా అధ్యక్షుడి బాధ్యతల నుంచి తప్పుకుంటున్న జో బైడెన్ సైతం ట్రంప్ ప్రమాణస్వీకారానికి హాజరవుతున్నారు. 2020లో అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికయినప్పుడు ఆయన ప్రమాణస్వీకారానికి ట్రంప్ దూరంగా ఉండిపోయారు. కాగా, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, జార్జి డబ్లూ బుష్, బరాక్ ఒబామా సైతం ట్రంప్ ప్రమాణస్వీకారాని హాజరుకానున్నారు. వీరితో పాటు ట్రంప్ చేతిలో అధ్యక్షుడి బరిలో గట్టి పోటీ ఇచ్చి ఓటమిపాలైన కమలా హ్యారిస్ సైతం హాజరువుతున్నారు. ఇటాలియన్ ప్రధాన మంత్రి మెలోని, హంగేరీకి చెందిన విక్టర్ ఓర్బాన్, అర్జింటీనా అధ్యక్షుడు జేవియర్ మిలే, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, భారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ హాజరుకానున్నారు.
Read More International News and Latest Telugu News