Home » swearing-in ceremony
వారిద్దరూ బీజేపీలో అంకితభావం కలిగిన నేతలు. పార్టీ సిద్ధాంతమే ఊపిరిగా, అధినాయకత్వం ఆదేశాలే శిరోధార్యంగా పనిచేస్తూ సమర్థత నిరూపించుకున్న వారిద్దరూ కేంద్ర మంత్రులయ్యారు. ఆ ఇద్దరే... గంగాపురం కిషన్‌రెడ్డి, బండి సంజయ్. సికింద్రాబాద్ నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించిన కిషన్‌రెడ్డికి మరోసారి క్యాబినెట్ హోదా లభించగా, కరీంనగర్ నుంచి వరుసగా రెండోసారి గెలుపొందిన బండి సంజయ్‌కి, సహాయ మంత్రిగా అవకాశం వచ్చింది.
మంత్రులంతా ప్రజలకు నచ్చేలా అణకువగా, హుందాగా ఉండాలని, విధి నిర్వహణలో అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలని కేంద్ర నూతన మంత్రి వర్గానికి ప్రధాని మోదీ సూచించారు. వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరేందుకు మంత్రి వర్గమంతా కృషి చేయాలని స్పష్టం చేశారు.
రాష్ట్రపతి భవన్ ఆవరణలో ఆదివారం సాయంత్రం వేలాదిమంది ఆహుతులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు, పొరుగు దేశాల అధినేతల సమక్షంలో 73 ఏళ్ల నరేంద్రమోదీ భారతదేశ ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి ప్రమాణం చేశారు. తద్వారా దేశ చరిత్రలో ఇప్పటి వరకూ మాజీ ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూకు మాత్రమే సాధ్యమైన రికార్డును సమం చేశారు.
బీజేపీ నేత, వారణాసి ఎంపీ నరేంద్ర మోదీ(Narendra Modi) నేడు (జూన్ 9న) రాత్రి 7:15 గంటలకు వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం(swearing ceremony) చేయనున్నారు. ఈ కార్యక్రమం దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ(delhi) పోలీసులు అందుకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను సిద్ధం చేశారు.
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మంగళవారంనాడు వెలువడనున్న నేపథ్యంలో కొత్త ప్రధానమంత్రి ప్రమాణ స్వీకార వేదిక వద్ద చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై సెక్యూరిటీ ఏజెన్సీలు దృష్టి సారిస్తున్నాయి. ఈ వారాంతంలోనే ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండొచ్చని చెబుతున్నారు.