AP Swearing in ceremony: ఆంధ్రప్రదేశ్, ఒడిశా ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారానికి మోదీ
ABN , Publish Date - Jun 10 , 2024 | 05:41 PM
ఆంధ్రప్రదేశ్, ఒడిశా ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరువుతున్నారు. జూన్ 12న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుంది.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), ఒడిశా (Odisha) ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారానికి (Oath taking ceremonies) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) హాజరువుతున్నారు. జూన్ 12న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ చీఫ్ ఎన్.చంద్రబాబునాయుడు (N. Chandrababu Naidu) రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణస్వీకారం చేయనుండగా, ఒడిశా ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా బీజేపీ అధికారికంగా ప్రకటించ లేదు.
కాగా, జూన్ 12వ తేదీ మధ్యాహ్నం 4.55 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్.చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నట్టు తెలుగుదశం పార్టీ నేత కె.రఘురామ కృష్ణంరాజు సోమవారంనాడు తెలిపారు. మరోవైపు, ఒడిశా ముఖ్యమంత్రి ఎంపికకు సంబంధించి బీజేపీ లెజిస్లేటివ్ సమావేశం మంగళవారం జరుగుతుందని ఆ పార్టీ ఒడిశా చీఫ్ మన్మోహన్ సమాల్ చెప్పారు.
Modi 3.0: ఇంతకీ లోక్‌సభ స్పీకర్ ఎవరు?
ఏపీ, ఒడిశా ఫలితాలివే..
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 144 స్థానాల్లో పోటీచేసి 135 సీట్లు గెలుచుకుంది. ఆ పార్టీ భాగస్వామి జనసేన 21 స్థానాల్లో పోటీ చేసి అన్నిచోట్లా గెలుపొందగా, బీజేపీ 10 స్థానాల్లో పోటీచేసి 8 గెలుచుకుంది. వైఎస్ఆర్‌సీపీ 11 సీట్లకే పరిమితమైంది. అటు ఒడిశాలో బిజూ జనతాదళ్‌ను బీజేపీ ఓడించి, నవీన్ పట్నాయక్ 24 ఏళ్ల పాలనకు చరమగీతం పాడింది. 147 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 78 స్థానాల్లో గెలుపొందగా, బీజేడీ 51 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ 14 సీట్లు గెలుచుకుంది.
Read More National News and Latest Telugu News