Home » Swiggy
ఆన్లైన్ ఫుడ్ సర్వీస్ మొదలైనప్పటి నుంచి రెస్టారెంట్ల నుంచి ఫుడ్ ఆర్డర్(online food orders) చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రధానంగా ఉద్యోగులు, బ్యాచులర్స్ ఈ సేవలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. అయితే దేశంలో వెజ్ ఆర్డర్లు ఎక్కువగా వచ్చే నగరాల గురించి స్విగ్గీ కీలక విషయాలను తెలిపింది. ఆవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ(Swiggy) తన IPOను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈ కంపెనీకి పెద్ద ఆఫర్ వచ్చింది. ఈ నేపథ్యంలో అమెజాన్ ఇండియా(Amazon india) కంపెనీతో చేతులు కలపాలని ప్రతిపాదించింది.
మెట్రోపాలిటన్ సిటీస్‌లో ఆన్ లైన్ డెలివరీ బాగా జరుగుతోంది. స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీల సంగతి చెప్పక్కర్లేదు. వీక్ డేస్ కన్నా వీకెండ్లో డెలివరీలు ఎక్కువగా ఉంటాయి. పుణేకు చెందిన ఓ వ్యక్తి ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఫుడ్ డెలివరీ కోసం మొబైల్ లోకేషన్ చూసి షాక్ తిన్నాడు.
ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటోలు(Swiggy, Zomato) షాక్ ఇచ్చాయి. ఇవి తమ ప్లాట్‌ఫారమ్ ఫీజు ధరలను రూ.6 పెంచినట్లు సమాచారం.
దేశంలో ఆహార డెలివరీ బిజినెస్ 2030 నాటికి రూ.10 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని బెయిన్ అండ్ కంపెనీ, స్విగ్గీ జాయింట్ రిపోర్ట్ వెల్లడించింది. యూజర్ల సంఖ్య అప్పటికి 45 కోట్ల వరకు చేరొచ్చని అంచనా వేసింది. ‘హౌ ఇండియా ఈట్స్’ పేరుతో ఈ రిపోర్ట్ విడుదల చేశారు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ విభాగం 18 శాతం వార్షిక సమ్మిళిత వృద్ధి రేటు (CAGR) సాధించొచ్చని రిపోర్ట్ తెలిపింది.
గురుగ్రామ్‌లోని ఓ ఇంటికి ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చిన డెలివరీ బాయ్.. బయటే ఉన్న విలువైన నైక్ షూస్‌ని దొంగిలించాడు. ఈ మధ్యే జరిగిన ఈ ఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దొంగతనం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
గురుగ్రామ్‌లో గల ఓ ఇంటి బయట షూ ఉన్నాయి. అక్కడి నుంచి వెళుతున్న స్విగ్గీ డెలివరీ బాయ్ బయట కనిపించిన షూ తీసుకెళ్లాడు. ఈ నెల 9వ తేదీన ఘటన జరిగింది. తర్వాత ఫుటేజీ చూసిన రోహిత్ అరోరా అనే వ్యక్తి తన స్నేహితుడి షూ దొంగతనం చేశాడని సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు.
దేశంలో రెండో అతిపెద్ద ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ ( Swiggy).. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో రైలు ప్రయాణీకులకూ ఆర్డర్ చేసిన భోజనాన్ని అందించడానికి ఐఆర్సీటీసీతో ఒప్పందం కుదుర్చుకుంది.
మహిళ స్విగ్గీ అకౌంట్ హ్యాక్ చేసిన ఇద్దరు నిందితులు ఆమె అకౌంట్ ద్వారా ఏకంగా రూ.97 వేల విలువ గల వస్తువులను ఆర్డరిచ్చాడు. తన అకౌంట్లో అకస్మాత్తుగా డబ్బు మాయమవడం గుర్తించిన బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించారు.
పాపం.. పిల్లలకోసం స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసిన మహిళకు ఊహించని అనుభవం ఎదురయ్యింది.