Share News

Swiggy: స్విగ్గీ ఏజెంట్‌కు ఫాలొయింగ్.. ఏంటంటే..!!

ABN , Publish Date - Jul 15 , 2024 | 03:31 PM

మెట్రోపాలిటన్ సిటీస్‌లో ఆన్ లైన్ డెలివరీ బాగా జరుగుతోంది. స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీల సంగతి చెప్పక్కర్లేదు. వీక్ డేస్ కన్నా వీకెండ్‌లో డెలివరీలు ఎక్కువగా ఉంటాయి. పుణేకు చెందిన ఓ వ్యక్తి ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఫుడ్ డెలివరీ కోసం మొబైల్ లోకేషన్ చూసి షాక్ తిన్నాడు.

Swiggy: స్విగ్గీ ఏజెంట్‌కు ఫాలొయింగ్.. ఏంటంటే..!!
Swiggy Agent

మెట్రోపాలిటన్ సిటీస్‌లో ఆన్ లైన్ డెలివరీ బాగా జరుగుతోంది. స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీల సంగతి చెప్పక్కర్లేదు. వీక్ డేస్ కన్నా వీకెండ్‌లో డెలివరీలు ఎక్కువగా ఉంటాయి. పుణేకు (Pune) చెందిన ఓ వ్యక్తి ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఫుడ్ డెలివరీ కోసం మొబైల్ లోకేషన్ చూసి షాక్ తిన్నాడు.


ఏం జరిగిందంటే..?

పుణేలో డెలివరీ పర్సన్ ఆర్డర్ తీసుకొని అతని ఇంటికి వస్తున్నాడు. డెలివరీ పర్సన్ వెనకాల ఎవరో ఉన్నారు. అతనిని అనుసరిస్తున్నారు. దెయ్యం మాదిరిగా ఉండటంతో కాసింత భయపడ్డాడు. అయినప్పటికీ స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది తెగ వైరల్ అవుతోంది. నెటిజన్ల కామెంట్లతో ఆ సెక్షన్ నిండిపోయింది.


మీ కంపెనీ డిజైనా..?

ఆ పిక్ తీసిన అతను స్విగ్గీ కంపెనీకి స్క్రీన్ షాట్ పెట్టారు. ఇది ఏంటి అని అడిగారు. మీ కంపెనీ కొత్త డిజైనా..? అని కొశ్చన్ చేశారు. నా డెలివరీ బాయ్‌కు ప్రమాదం జరిగిందని ఆ ఫొటోకు క్యాప్షన్ పెట్టారు. ఆ ఫొటోకు ఇప్పటికే 342కే వ్యూస్ వచ్చాయి. ఆ పిక్‌కు సంబంధించి నెటిజన్లు థియరీలు, జోక్స్ వేస్తున్నారు.


Viral Video: పిచ్చి పీక్స్‌కు చేరింది భయ్యా.. పొలం పని చేసే పారతో కటింగ్.. నెటిజన్ల కామెంట్లు చదివితే..తప్పించుకోలేవు..!!

నీవు నీడ నుంచి తప్పించుకోని పారిపోలేవు అని ఒకరు కామెంట్ చేశారు. అది డ్రోన్ డెలివరీ అని మరొకరు రాశారు. అతని నీడ ట్రాక్ చేసి, గాలిలో ఎగురుతుందని మరొకరు అభిప్రాయ పడ్డారు. డెలివరీ బాయ్ సబ్ వే సర్ఫర్స్ గేమ్ ఆడుతున్నారని మరొకరు రాశారు. ఇలా ఒక్కొక్కరు ఒకో అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి..


Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. కళ్ల ముందే నదిలో ఎలా కొట్టుకుపోయాడో చూడండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 15 , 2024 | 03:37 PM