Home » TDP - Janasena
ప్రజలు అధికారం ఇచ్చింది ఎంజాయ్ చేయడానికి కాదు.. బాధ్యతతో వ్యవహరిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడానికే అని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నోసార్లు చెప్పారు.
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సచివాలయంలోని 5 వ బ్లాక్లో కలెక్టర్లతో సమావేశం అయ్యారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి భేటీ ఇదే కావడం గమనార్హం. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఇవాళ జరుగుతున్న కాన్పరెన్స్ చరిత్రాత్మకమైన కాన్ఫరెన్స్ అని, చరిత్ర తిరగరాయబోతోందని అన్నారు.
ప్రభుత్వం మారింది! కానీ... పరిస్థితులను మాత్రం వైసీపీ అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గతంలో అడ్డగోలుగా తవ్వుకున్న లేటరైట్ ఖనిజాన్ని ఇప్పుడు దర్జాగా తరలించుకుపోతున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతిపత్రాలు ఇవ్వడానికి వేల సంఖ్యలో తరలివచ్చిన అర్జీదారులతో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం కిటకిటలాడింది. ప్రతి శనివారం ఆయన పార్టీ కార్యాలయానికి వస్తుండటంతో తమ సమస్యలు నేరుగా వివరించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి శనివారం భారీగా ప్రజానీకం తరలివచ్చారు.
రాష్ట్రంలో దెబ్బతిన్న వ్యవస్థలన్నింటినీ వంద రోజుల్లో గాడిలో పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. శనివారం టీడీపీ ప్రధాన కార్యాలయంలో గ్రీవెన్స్ సందర్భంగా ప్రజల నుంచి వినతిపత్రాలు తీసుకునేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్ని వినతులు వచ్చినా...
ఏలూరు రైల్వేస్టేషన్లో వందేభారత్ రైలుకు హాల్టింగ్ ఇవ్వాలని రైల్వే ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(కోచింగ్) దేవేంద్రకుమార్కు ఎంపీ పుట్టా మహే్ష కుమార్ విజ్ఞప్తి చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఐదవరోజు శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. ఈ సందర్భంగా పత్రికలకు ప్రకటనలపై శాసనసభ దద్ధరిల్లింది. టీడీపీ సభ్యుల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు పడిన కష్టాలు.. ప్రతిపక్షాలు ఎదుర్కొన్న హింసా రాజకీయాలు.. బాధితులే నిందితులైన ప్రభుత్వ టెర్రరిజాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ఆవిష్కరించారు. కట్టుతప్పిన శాంతి భద్రతలు, హత్యలు, అత్యాచారాలు, బెదిరింపులు, గంజాయి, డ్రగ్స్ దిగుమతితో ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోయిందో వివరించారు. శాంతి భద్రతల విషయంలో నూతన అధ్యాయం ప్రారంభించబోతున్నామని చంద్రబాబు వెల్లడించారు. జగన్ హయాంలో జరిగిన అరాచకాలపై
టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో నామినేటెడ్ పదవుల పంపకానికి అధినాయకత్వాలు సిద్ధమయ్యాయి. శ్రమ జీవులు, పోరాటాల వీరులకు న్యాయం జరిగే రోజులు వచ్చాయి. జాబితాల రూపలకల్పన ప్రక్రియ మొదలైంది. వైసీపీ హయాంలో ఎవరెవరు ఇబ్బందులు ఎదుర్కొన్నారు..? పార్టీ కోసం ఎంతగా కష్టపడ్డారు..? ఎన్ని కేసులను భరిస్తున్నారు..? శ్రేణులకు ఏ స్థాయిలో ఉండగా నిలిచారు..? ఎలాంటి త్యాగాలు చేశారు..? ఈ ప్రశ్నలకు జవాబులే ప్రాతిపదికగా జాబితాలు తయారవుతున్నాయి. అందులో తమ పేరు ఉండాలని, కుర్చీ తమకే దక్కాలని ఆశావహులు ప్రయత్నాలను ప్రారంభించారు. ...
ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ క్యాడర్ పూర్తిగా డీలా పడింది. సానుకూల ఫలితాలు రాకపోవడంతో వైసీపీ అధినేత జగన్ (Y S Jagan) సైతం కొద్దిరోజుల పాటు చడీచప్పుడు లేకుండా సైలెంట్ అయిపోయారు.