Home » Telugu Desam Party
Dola Sree Bala Veeranjaneya Swamy: అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై చంద్రబాబు ముందుగా నిర్ణయం తీసుకున్నారని మంత్రి, డోలా బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. అమరావతిలో భూమి కేటాయించారన్నారు. అమరావతి స్మృతి వనం పక్కనపెట్టి ఇక్కడ నిర్మాణం చేశారని మంత్రి, డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు.
Minister Kollu Ravindra: వైసీపీ అధినేత జగన్‌పై మంత్రి కొల్లు రవీంద్ర సంచలన ఆరోపణలు చేశారు.ఐదేళ్ల క్రితం జగన్ ప్రభుత్వం విశాఖలో భూములు కొట్టేసిందని ఆరోపించారు. దసపల్లా, వాల్తేరు క్లబ్ భూములు కూడా కొట్టేసేందుకు ప్రయత్నం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు.
TDP High Command: విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ను ఏపీ డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ నేతలు ఆ పార్టీ హై కమాండ్‌కు వరుసగా విజ్ఞాపనలు చేస్తున్నారు. అయితే దీనిపై టీడీపీ హై మాండ్ కీలక ఆదేశాలు జారీ చేసింది.
Somireddy Chandra Mohan Reddy: డిప్యూటీ సీఎం పదవికి నారా లోకేష్ అన్ని విధాలా అర్హులే అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రాజకీయంగా అనేక సవాళ్లు ఎదుర్కొని, అవమానాలు పడిన తర్వాత యువగళం పాదయాత్రతో తనలోని నాయకత్వ లక్షణాలను లోకేష్ నిరూపించుకున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.
NTR Death Anniversary: ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు.. ప్రభంజనం. అదొక సంచలనంమని ఏపీ మంత్రి నారా లోకేష్ స్మరించుకున్నారు తెలుగువాడి విశ్వరూపం ఎన్టీఆర్ అని కొనియాడారు. సామాజిక న్యాయం, ప్రజాసంక్షేమం అనే సిద్ధాంతాలపై తెలుగుదేశం పార్టీ నిర్మితమైందని నారా లోకేష్ పేర్కొన్నారు.
Guntur Politics: గుంటూరు నగర పాలక సంస్థలో రాజకీయాలు హాట్ హాట్‌గా ఉన్నాయి. కౌన్సిల్ సమావేశంపై సందిగ్ధత నెలకొంది. ఈ సమావేశం గురించి వైసీపీ సభ్యులు అత్యవసరంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొని వైసీపీ సభ్యులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
Buddha Venkanna: మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకటరామిరెడ్డి తమపై దాడికి ఉసిగొల్పారని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు.తురక కిషోర్ తమపై దాడి చేసి చేసి చంపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో పిన్నెల్లి సోదరులు, తురక కిషోర్‌లు ఎన్నో దారుణాలు చేశారని విమర్శించారు.
MLC Ashok Babu: ఉద్యోగాల కల్పన కోసం పెట్టుబడులు రాబట్టేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. ప్రపంచంలో ప్రముఖ కంపెనీల్లో భారతీయులే ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారని తెలిపారు. భవిష్యత్తు యువతదే అని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశంతో రాత్రికిరాత్రి అధికారులు వేసిన బోరుబావితో ఆ పేద రైతు జీవితంలో వెలుగు నిండింది. ‘జై చంద్రబాబు.. జై జై చంద్రబాబు అన్న అసంకల్పిత నినాదం ఆయప్ప నోటివెంట వెలువడింది.
‘నేను నాయకులను చూడడానికి రాలేదు, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చాను.’ ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం నియోజకవర్గ పర్యటనలో చెప్పిన ఈ మాటను ఆయన మూడ్రోజుల పర్యటనలో నిజం చేశారు. అభివృద్ధే అజెండాగా ఆయన పర్యటన ఆద్యంతం సాగింది. పర్యటనల్లోకంటే భిన్నంగా పార్టీ శ్రేణులను ఈసారి చంద్రబాబు దూరం పెట్టారు. ప్రభుత్వాధికారులకు అధిక ప్రాధాన్యమిచ్చారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతోనే పూర్తిగా మమేకం అయ్యారు.