Home » TG Politics
తెలంగాణ ప్రభుత్వానికి మద్యంపై ఉన్న ధ్యాస రైతులకు మద్దతు ధర ఇచ్చేందుకు లేదని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ట్వీట్ చేశారు. మందుపై ఉన్న ధ్యాస మంచి బోధన, మందుబిళ్లలు, మూసీ బాధితులు, మంచినీళ్లపై లేదన్నారు.
రైతుల భూములను కేసీఆర్, హరీష్‌రావులు బలవంతంగా లాక్కున్నారని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. భూనిర్వాసితుల సమస్యలపైన హరీష్‌రావుతో చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. హరీష్‌రావు టైం, డేట్ ఫిక్స్ చేయాలని సవాల్ విసిరారు
తెలంగాణలో వ్యవసాయ, విద్యా, విద్యుత్ రంగాలు అధ్వానంగా మారాయని బీర్ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురుకులాల బిల్డింగులకు కనీసం అద్దె చెల్లించే స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర సాధనకు ‘అలయ్ బలయ్’ స్ఫూర్తి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఉద్యమ సమయంలో రాష్ట్ర సాధన ఆలస్యమవుతోందని భావించిన తరుణంలో రాజకీయ జేఏసీ ఆవిర్భవించిందని.. దాని ఏర్పాటుకు స్ఫూర్తి అలయ్ బలయ్ కార్యక్రమమేనని చెప్పారు.
శాసనమండలి ప్రతిపక్ష నేతగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి బాధ్యతలు స్వీకరించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha), పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి(Revuri Prakash Reddy) వర్గీయుల మధ్య ప్లెక్సీ వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగలు, రాత్రి తేడా లేకుండా కష్టపడుతున్నారని ఎంపీ మల్లు రవి అన్నారు. తమిళనాడులో కరుణానిధి, జయలలితను విప్లవ నాయకులు అంటారని, ఇకపై సీఎం రేవంత్ రెడ్డిని కూడా అలానే పిలవాలని ఎంపీ అభిప్రాయపడ్డారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దసరా పండుగ వచ్చేసింది.. దసరా సరదాలకు ఊరూవాడ సిద్ధమయ్యాయి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,
కేంద్ర ప్రభుత్వం గోదావరి పుష్కరాల వేడుకల నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్‌కు రూ.100 కోట్లు ఇచ్చిందని, తెలంగాణ రాష్ట్రానికి మాత్రం గుండు సున్నా మిగిల్చిందని హరీశ్ రావు ఫైర్ అయ్యారు.
మూసీ రిటర్నింగ్ వాల్ నిర్మించి కూడా సుందరీకరణ చేయెచ్చని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అన్నీ డ్రైనేజీలు మూసీలోనే కలుస్తున్నాయని, కనీసం శుద్ధి జరగకుండా నేరుగా నదిలోనే ముగురునీరు కలుస్తోందని ఆయన చెప్పారు.