Home » TG Politics
బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి గొప్పలు చెప్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్లా మారారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు.
తెలంగాణ రైతులకు పూర్తి రుణమాఫీ చేయాలని, ఎకరాకు రూ.15వేలు చొప్పున రైతు భరోసా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. గతేడాది డిసెంబర్ 9వ తేదీనే రుణమాఫీ చేస్తానని సీఎం చెప్పారని కేటీఆర్ అన్నారు.
హామీలు అమలు చేసే వరకూ రేవంత్‌ను వదిలిపెట్టామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు హెచ్చరించారు. ఒక్క బస్సు తప్ప రేవంత్ పాలన అంతా తుస్సేనని విమర్శించారు. రైతులు చనిపోయినా రేవంత్‌కు కనికరం లేదా అని ప్రశ్నించారు. ప్రజల నుంచి నిరసన వచ్చినప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులను రైతులు నిలదీయాలని అన్నారు.
మూసీ మురికిలో బతుకుతున్న పేదలకు ఇళ్లు ఇచ్చి, రూ.25వేలు ఇచ్చి వారి ఆత్మగౌరవాన్ని పెంచుతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ నేతల ఫామ్ హౌస్‌లను కాపాడుకోవడానికే పేదల ముసుగు అడ్డం పెట్టుకుంటున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి కేటీఆర్ అక్రమంగా నిర్మించిన ఫామ్ హౌజులు కూల్చాలా వద్దా? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం , ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. మూడు, నాలుగు వేల ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేసి.. మిగిలిన 10 వేల ఎకరాలను ప్లాట్లు చేసి అమ్మే కుట్ర చేస్తున్నారని హరీష్‌రావు విమర్శించారు.
కొందరు హీరోయిన్లు హడావిడిగా పెళ్లి చేసుకోవడానికి కేటీఆర్ కారణమని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. రకుల్‌ప్రీత్ సింగ్ తొందరగా పెళ్లి చేసుకోవడానికి కేటీఆరే కారణమని చెప్పారు. కొంతమంది హీరోయిన్ల ప్రయివేట్ సంభాషణను రికార్డు చేసి..
అధికారిక కార్యక్రమంలో భాగంగా ఒక తమ్ముడిగా మంత్రి సురేఖకు కండువా కప్పానని, దాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేశారని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు బీఆర్ఎస్ నేతలను కంట్రోల్ చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు.
కేసీఆర్ అవినీతి లక్ష కోట్లను సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి కక్కిస్తామని మెదక్ ఎంపీ రఘునందన్ రావు హెచ్చరించారు. నాడు పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్.. సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారని.. కానీ ఇప్పుడు సిట్టింగ్ జడ్జి దొరకలేదా? రిటైర్ అయిన జడ్జితో సిట్ వేశారని ఎద్దేవా చేశారు. రేవంత్ మూసీ సుందరీకరణ పేరిట కొత్త డ్రామా మొదలు పెట్టారని విమర్శించారు.
అమృత్ టెండర్లకు సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ(ఆదివారం) తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
హైడ్రాపై కొంత మంది ప్రతిపక్షాల నేతలు సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. అలాంటి ప్రచారాలను తెలంగాణ నమ్మెుద్దని ఆయన కోరారు.