Share News

కాంగ్రెస్‌ నేతకు గుండెపోటు

ABN , Publish Date - Apr 05 , 2025 | 04:59 AM

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటనలో గుండెపోటుకు గురైన ఓ కాంగ్రెస్‌ నేతకు ఎమ్మెల్యే డాక్టరు తెల్లం వెంకట్రావు సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడారు.

కాంగ్రెస్‌ నేతకు గుండెపోటు

  • సీపీఆర్‌ చేసి కాపాడిన ఎమ్మెల్యే వెంకట్రావు

దుమ్ముగూడెం, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటనలో గుండెపోటుకు గురైన ఓ కాంగ్రెస్‌ నేతకు ఎమ్మెల్యే డాక్టరు తెల్లం వెంకట్రావు సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడారు. శుక్రవారం మంత్రి తుమ్మల భద్రాచలం పర్యటనకు వచ్చారు. ఆ పర్యటనలో వారి వెంట ఉన్న దుమ్ముగూడెం మండలం లచ్చిగూడెంకు చెందిన కాంగ్రెస్‌ నేత తోటమళ్ల సుధాకర్‌కు గుండెపోటు వచ్చింది.


అక్కడే ఉన్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్‌ తెల్లం వెంకట్రావు వెంటనే సుధాకర్‌కు సీపీఆర్‌ చేశారు. అనంతరం సుధాకర్‌ను ఆస్పతికి తరలించారు. వైద్యులు గుండె రక్తనాళాల్లో రెండు స్టెంట్లు వేశారు. సుధాకర్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఎమ్మెల్యే సీపీఆర్‌ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కాగా, ఆయనకు నెటిజన్లు, కాంగ్రెస్‌ శ్రేణుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - Apr 05 , 2025 | 04:59 AM