Home » TS News
నగరంలో వెలుగుచూసిన రూ.40 కోట్ల స్కామ్లో సైబరాబాద్ పోలీసులు పురోగతి సాధించారు. శంషాబాద్ ఇండస్ఇండ్ బ్యాంక్ మేనేజర్ రామస్వామిని అరెస్ట్ చేశారు. మరో బ్యాంకు ఉద్యోగి రాజేశ్తో కలిసి రూ.40 కోట్లు స్వాహా చేశారు.
Telangana: నగరంలోని నార్సింగీ గంధంగూడలో బుల్లెట్ బీభత్సం సృష్టించింది. ఓ ఇంట్లోకి అకస్మాత్తుగా బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో ఇంట్లోని మహిళకు గాయాలయ్యాయి. కాలులోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో మహిళ కుప్పకూలిపోయింది. దీంతో వెంటనే కుటుంబసభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే నార్సింగి పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
సాఫ్ట్వేర్ యువతిపై సామూహిక అత్యాచారం హైదరాబాద్లో తీవ్ర కలకలం రేపింది. వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో సాఫ్ట్వేర్ యువతిపై అత్యాచారం జరిగింది.
Telangana: విద్యుత్ కమిషన్ కొత్త చైర్మన్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. ఇందుకోసం రిటైర్డ్ జడ్జీలను సర్కార్ పరిశీలిస్తోంది. జస్టిస్ వెంకటేశ్వర రావు ప్రభుత్వ పరీశీలనలో ఉన్నట్లు సమాచారం. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోలు, ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలను బయటపెట్టేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఇందులో భాగంగా విద్యుత్ కమిషన్ కొత్త చైర్మన్ కోసం కసరత్తు మొదలుపెట్టింది.
నేడు ఆరవ రోజు తెలంగాణ శాసన సభ సమావేశాలు జరుగనున్నాయి. నిన్నంతా సభ చాలా వాడీవేడీగా జరిగింది. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. నిన్న సభ అంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వర్సెస్ అధికారపక్షంగా సాగింది.
మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాదిగ ఎమ్మెల్యేలు వినతి పత్రం సమర్పించారు. అసెంబ్లీ టీ బ్రేక్ సమయంలో అడ్లూరి లక్ష్మణ్, కవంపల్లి సత్యనారాయణ, మందుల సామ్యేల్, లక్ష్మీ కాంతారావు, వేముల వీరేశం.. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
Telangana: తెలంగాణ రైతులు ఎంతగానో ఎదురు చూసిన రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపించింది. మొదటి విడతగా లక్ష మేరకు రుణాలు మాఫీ చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుని.. దాన్ని అమలు చేసింది కూడా. అలాగే జూలై నెలాఖరు వరకు లక్షన్నర.. ఆగష్టు 15 నాటి మొత్తం రెండు లక్షల రుణాబకాయిలను రైతుల తరఫున ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించేలా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు.
Telangana: కమర్షియల్ ట్యాక్స్ స్కామ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రూ.1400 కోట్ల స్కామ్పై అసెంబ్లీలో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కుంభకోణంలో ఇప్పటికే ఐదు మందిపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ వ్యవహారంపై సీసీఎస్ పోలీసులు ఇప్పటికే ఆధారాలను సేకరించారు. 75 మంది పన్నులు చెల్లింపుదారులు ..
Telangana: తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ రంగంపై చర్చ కొనసాగుతోంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ... విద్యుత్ రంగంపై బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. ఉచిత విద్యుత్ ఇచ్చామని గొప్పలు చెప్పారన్నారు. అసలు రైతులకు ఉచితంగా విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ అని తెలిపారు. ‘‘మాజీ సీఎం కేసీఆర్ ఎందుకు సభకు రావడం లేదు? సభకు రాని వ్యక్తికి ప్రతిపక్ష నేత హోదా ఎందుకు? కేసీఆర్ సభకు వచ్చి మాట్లాడాలి’’ అని డిమాండ్ చేశారు.
Telangana: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు కొనసాగుతున్నాయి. శాసనసభలో విద్యుత్ రంగంపై చర్చలో భాగంగా గత బీఆర్ఎస్ సర్కార్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం మాట్లాడుతూ...‘‘సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి ఆవేదన చూస్తుంటే.. ఆల్రెడీ చర్లపల్లి జైలులో అన్నట్లు ఉంది. ఈ సభ్యుడు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పలు అంశాలు ప్రస్తావించారు. సత్య హరిచంద్రుడి వంశంలో పుట్టాం....