CM Revanth: త్వరలోనే స్పోర్ట్స్ పాలసీ...
ABN , Publish Date - Aug 02 , 2024 | 12:48 PM
Telangana: తెలంగాణలో క్రీడాకారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీని తీసుకువస్తామని అసెంబ్లీ వేదికగా తెలియజేశారు. శుక్రవారం శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ... గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించాలని బడ్జెట్‌లో రూ.321 కోట్లు కేటాయించిందని తెలిపారు.
హైదరాబాద్, ఆగస్టు 2: తెలంగాణలో (Telangana) క్రీడాకారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీని తీసుకువస్తామని అసెంబ్లీ వేదికగా తెలియజేశారు. శుక్రవారం శాసనసభలో (Telangana Assembly) ముఖ్యమంత్రి మాట్లాడుతూ... గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించాలని బడ్జెట్‌లో రూ.321 కోట్లు కేటాయించిందని తెలిపారు. చదువులోనే కాదు క్రీడల్లోరాణిస్తే కూడా ఉన్నత ఉద్యోగం వస్తుందని, కుటుంబ గౌరవం పెరుగుతుందన్నారు. ఇది నిరూపించేందుకే నిఖత్ జరీన్‌కు ఆర్థిక సాయంతో పాటు జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకునేందుకు 600 గజాల ప్లాట్ ఇచ్చామని, అలాగే ఇంటర్ చదవిన సిరాజ్‌కు ఎడ్యుకేషన్‌కు ఎగ్సెమ్షన్ ఇచ్చి మరీ గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చామని చెప్పారు. గ్రాడ్యుయేట్ అయిన నిఖత్‌కు కూడా గ్రూప్ -1 ఉద్యోగం ఇచ్చామని తెలిపారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీ తీసుకువస్తామన్నారు.
Chandrababu: ఒక్కరోజులో 97 శాతం పింఛన్ల పంపిణీ సంతృప్తిని ఇచ్చింది
వివిధ రాష్ట్రాల పాలసీలు అధ్యయనం చేసి బెస్ట్ పాలసీని తీసుకొస్తామని సీఎం స్పష్టం చేశారు. హర్యానాలో అత్యధికంగా క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో స్పోర్ట్స్ పాలసీని సభలో ప్రవేశపెడతామన్నారు. మండల కేంద్రాల్లో భూములు అందుబాటులో ఉంటే స్టేడియం నిర్మించడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడించారు. బ్యాగరి కంచెలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు బీసీసీఐతో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని.. వారు కూడా సానుకూలంగా స్పందించారని చెప్పారు. రాబోయే కొద్దిరోజుల్లోనే ఇందుకు భూమిని కేటాయిస్తామన్నారు. స్పోర్ట్స్ విషయంలో నిధుల కేటాయింపుతో పాటు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళతామని చెప్పుకొచ్చారు.
Supreme Court: ఎన్టీఏ లోపాల వల్లే లీకేజీ..!!
వ్యసనాల నుంచి యువతను బయటకు తీసుకువచ్చేందుకు క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. స్పోర్ట్స్ పాలసీ కోసం ఎవరు ఏ సలహాలు ఇచ్చినా స్వీకరిస్తామన్నారు. హైదరాబాద్‌లో గతంలో నిర్మించిన స్టేడియాలు ప్రైవేట్, రాజకీయ కార్యక్రమాలకే పరిమితమయ్యాయని తెలిపారు. వీటన్నింటినీ అప్ గ్రేడ్ చేసి విద్యార్థులకు క్రీడలపై ఆసక్తిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకోవాలనుకుంటుందని.. అందుకు అందరి మద్దతును కోరుతున్నామన్నారు. అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకుంటే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
Dogs: గంటల వ్యవధిలో 28 మందిపై కుక్కల దాడి.. జంకుతున్న జనం
Sitarama Project: సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ 2 ట్రాయల్ రన్ సక్సెస్...
Read Latest Telangana News And Telugu News