Home » Uttar Pradesh
మహాకుంభ్‌ను పదేపదే తలుచుకోవడం మంచి విషయమేనని, అయితే మహాకుంభ్ నిర్వహణకు భారత ప్రభుత్వం ఎంత బడ్జెట్ ఇచ్చిందనేది ప్రధాన ప్రశ్న అని అఖిలేష్ యాదవ్ అన్నారు.
సౌరభ్ ఇంటికి తిరిగి రావటం ముస్కాన్‌కు నచ్చలేదు. ఎలాగైనా అతడి అడ్డు తొలగించాలని భావించింది. తినే తిండిలో నిద్రమాత్రలు కలిపింది. అతడు నిద్రపోయిన తర్వాత దారుణానికి పాల్పడింది.
విద్యుత్ శాఖ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. కొన్ని వేల కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్లను నిలిపివేయడానికి సన్నాహాలు చేస్తూ ఉంది. మరికొద్దిరోజుల్లో అమలు చేయనుంది.
24 మంది దళితుల హత్య కేసులో 44 సంవత్సరాల తర్వాత మెయిన్‌పురి జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో ముగ్గురు నిందితులకు మరణ శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది.
పబ్ జీ ద్వారా పరిచయం అయిన యువకుడి కోసం సీమా పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చింది. ఆమె అక్రమంగా దేశంలోకి ప్రవేశించటంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. తర్వాత ఆమె బెయిల్ మీద బయటకు వచ్చింది.
కుంభమేళా విజయవంతం కావడానికి సమిష్టి కృషి కారణమని ప్రధాని మోదీ లోక్‌సభలో అన్నారు. ఈ విజయం కోసం కృషి చేసిన కర్మయోగులందరికీ ధన్యవాదాలు తెలిపారు.
అప్పుడప్పుడు అనేక మందికి స్పామ్ కాల్స్ లేదా సైబర్ ఫ్రాడ్ కాల్స్ వస్తుంటాయి. వీటి విషయంలో పలువురు మోసపోతుండగా, మరికొంత మంది మాత్రం వాటిని స్కిప్ చేస్తారు. కానీ ఇటీవల ఓ యువకుడికి వచ్చిన స్కాం కాల్ విషయంలో ఏకంగా స్కామర్‌నే బోల్తా కొట్టించాడు. అది ఎలా చేశారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గతంలో వివాదంగా మారిన షాహి జామా మసీదు ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ మసీదులో హరిహర ఆలయం ఉందని హిందూ పక్షం తెలుపగా, తర్వాత సర్వే సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడి, నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కానీ తాజాగా ఈ మసీదుకు పెయింటింగ్ వేయాలని కోర్టు పర్మిషన్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
బహుమానంగా ఇచ్చిన నగలు తిరిగిచ్చేయమని మాజీ ప్రియుడు కోరడంతో రెచ్చిపోయిన యువతి మరి కొందరితో కలిసి అతడిని దారుణంగా కొట్టి విషం తాగించింది. యూపీలో ఈ షాకింగ్ ఘటన వెలుగు చూసింది.
సంభాల్‌లో శుక్రవారం జరిగిన హోలీ ఊరేగింపులో 3,00 మంది ప్రజలు పాల్గొన్నట్టు జిల్లా మెజిస్ట్రేట్ రాజేంద్ర పెన్సియా తెలిపారు. ఆర్పీఎఫ్, ప్రొవిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ, స్థానిక పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్ల చేశారని, డోన్లతో నిఘా నిర్వహించామని, ఎట్టకేలకు హోలి, రంజాన్ శుక్రవారం ప్రార్థనలు ప్రశాంతంగా ముగిసాయని చెప్పారు.