Viral News: స్కామర్‌ను స్కామ్ చేసిన యువకుడు.. 3 సార్లు 3 స్టోరీలు చెప్పి ఏకంగా..
ABN , Publish Date - Mar 17 , 2025 | 01:44 PM
అప్పుడప్పుడు అనేక మందికి స్పామ్ కాల్స్ లేదా సైబర్ ఫ్రాడ్ కాల్స్ వస్తుంటాయి. వీటి విషయంలో పలువురు మోసపోతుండగా, మరికొంత మంది మాత్రం వాటిని స్కిప్ చేస్తారు. కానీ ఇటీవల ఓ యువకుడికి వచ్చిన స్కాం కాల్ విషయంలో ఏకంగా స్కామర్‌నే బోల్తా కొట్టించాడు. అది ఎలా చేశారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు ఎక్కువవుతున్నాయి. స్కామ్ కాల్స్, డిజిటల్ అరెస్టుల వంటి ఘటనలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే వీటి గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాతోపాటు పోలీసులు కూడా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే సైబర్ మోసం గురిచి ఓ క్రేజీ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
మొదటిసారి ఓ స్టోరీ..
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన భూపేంద్ర సింగ్‌కు సీబీఐ అధికారిగా నటిస్తూ ఒక మోసగాడి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆ మోసగాడు సింగ్‌ను తన అశ్లీల వీడియోలు ఉన్నాయని బెదిరించాడు. ఆ కేసును మూసివేయడానికి రూ.16,000 చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఆ క్రమంలో మోసగాడి ఫోన్ కాల్ సంభాషణను సింగ్ పసిగట్టి ఆ ఫోన్ కట్ చేయకుండా, తనతో ఆడుకోవాలని భావించాడు. వీడియోల గురించి తన తల్లికి చెప్పొద్దని కాల్ చేసిన వ్యక్తిని కోరాడు. అలా చేస్తే తాను ఇబ్బందుల్లో పడతానని వెల్లడించాడు.
లొంగిపోయిన స్కామర్
కానీ తాను ప్రస్తుతం రూ. 16 వేలు చెల్లించాలంటే, ఇప్పటికే తాకట్టు పెట్టిన బంగారు గొలుసును తీసుకురావాలన్నాడు. దానిని తిరిగి తీసుకురావడానికి రూ.3,000 కావాలని స్కామర్‌కు చెప్పాడు. దీంతో అది నిజమని నమ్మిన స్కామర్ లొంగిపోయి భూపేంద్రకు రూ.3,000 ట్రాన్స్ఫర్ చేశాడు. ఇక్కడితో అయిపోలేదు. అతను మళ్లీ ఫోన్ చేయడంతో..భూపేంద్ర మరో స్టోరీ చెప్పాడు. తాను మైనర్ అయినందున ఆ ఆభరణాల వ్యాపారి గొలుసును విడుదల చేయడానికి నిరాకరించాడని తెలిపాడు. ఆ క్రమంలో మోసగాడిని తన తండ్రిగా మాట్లాడాలని కోరాడు.
మూడు సార్లు
ఆభరణాల వ్యాపారి వలె భూపేంద్ర స్నేహితుడు నటిస్తూ ఆ స్కామర్‌తో మాట్లాడాడు. అప్పుడు బంగారు గొలుసును విడుదల చేయడానికి స్కామర్‌ను అదనంగా మరో రూ.4,480 అడిగారు. కానీ రెండోసారి నకిలీ CBI అధికారి నిజమని నమ్మి మళ్లీ ఆ మొత్తాన్ని పంపించాడు. అతను మళ్ళీ భూపేంద్రను సంప్రదించగా, ఈసారి తాను తీసుకునే బంగారు రుణం గురించి మరో కథ చెప్పాడు. మళ్ళీ తన స్నేహితుడిని మోసగాడితో మాట్లాడేలా చేశాడు. ఆ క్రమంలో రూ.3,000 ప్రాసెసింగ్ ఫీజు చెల్లిస్తే రూ.1.10 లక్షల రుణం ఇస్తామని నమ్మించాడు.
పోలీసులకు..
ఆ స్కామర్ నమ్మి మళ్లీ భూపేంద్రకు రూ.3,000 బదిలీ చేశాడు. ఈ విధంగా భూపేంద్ర.. స్కామర్‌కు మూడు సార్లు, మూడు స్టోరీలు చెప్పి రూ.10,000 రాబట్టాడు. కానీ చివరకు తాను మోసపోయానని గ్రహించిన స్కామర్ తన డబ్బు కోసం వేడుకున్నాడు. నువ్వు నాకు అన్యాయం చేశావని, నా డబ్బు తిరిగి ఇవ్వాలని కోరాడు. ఆ తర్వాత భూపేంద్ర పోలీసులకు విషయాన్ని తెలిపి, ఆ డబ్బును విరాళంగా ఇస్తానని చెప్పాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు యువకుడి తీరును ప్రశంసించారు. ఇలాంటి ఘటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచించారు.
ఇవి కూడా చదవండి:
Viral Video: వడోదర కారు ప్రమాదంలో నిందితుడు డ్రైవింగ్ చేయలేదా..బాటిల్ వీడియో వైరల్
PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..
Gold Silver Rates Today: గుడ్ న్యూస్..రెండో రోజు కూడా తగ్గిన బంగారం, వెండి ధరలు..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News