Home » Varla Ramaiah
దౌర్జన్యాలకు పాల్పడిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని, ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నడిపేందుకు చర్యలు చేపట్టాలంటూ సీఈవో ముఖేశ్ కుమార్ మీనాకు టీడీపీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఆయనను కలిశారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ... సీఈవో ముఖేశ్ కుమార్ మీనాను కలిసి వైసీపీ దౌర్జన్యాలపై ఫిర్యాదు చేశామని తెలిపారు.
మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరాచకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ నేతలు వెల్లడించారు. ఈవీఎం ధ్వంసం చేసి, అరాచకం సృష్టించిన పిన్నెలిని తక్షణమే అరెస్ట్ చేయాలని డీజీపీని కలిసి మెమోరాండం అందజేశారు.
సీఐడీ డీజీని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నేతల బృందం సోమవారం కలిసింది. వైఎస్సార్సీపీ (YSRCP) కార్యకర్తలు టీడీపీ ముసుగులో దుష్ప్రచారం చేస్తున్నారని ఆధారాలతో సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
తిరుపతి,తాడిపత్రి, అనంతపురం, పల్నాడు ప్రాంతాల్లో జరిగిన దాడులపై సిట్ ఉన్నత అధికారులకు తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు.దాడులకు సంబంధించి వివరాలను సాక్షాధారాలతో సీట్ అధికారులకు అందజేసినట్లు టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య (Varlaramaiah) తెలిపారు. మొత్తం 30 ఘటనలకు సంబంధించిన వివరాలు తమ రిప్రజెంటేషన్‌లో పొందుపరిచామని చెప్పారు.
రాష్ట్రంలో అధికార మార్పిడి తథ్యమని అధికారులందరికీ తెలిసిపోయిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య(Varla Ramaiah) వ్యాఖ్యానించారు. అందుకోసమే కార్యాలయాల్లోని రికార్డులు తరలించడానికి సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో కార్యాలయాల్లోని రికార్డులు తరలించడానికి, మార్చడానికి వీల్లేదని ఆర్డర్ ఇవ్వాలని గవర్నర్‌ను కోరినట్లు వర్ల రామయ్య తెలిపారు.
నిన్న జరిగిన పోలింగ్‌లో 31 చోట్ల ఎన్నికలకు అంతరాయం కలిగిందని టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య (Varlaramaiah) అన్నారు. మాచర్ల, గురజాల, నరసరావు పేట, శ్రీకాళహస్తి తదితర చోట్ల పోలింగ్‌కు ఆటంకం కలిగిందని అన్నారు. ఆయా చోట్ల రీపోలింగ్ చేయాలని ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాను కోరామని చెప్పారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి నెలకొంది. రేపు(సోమవారం) అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. పోలింగ్‌లో మీ ఓటును మీరు కాకుండా ఇతరులు ఎవరైనా వేసినట్లు గుర్తిస్తే వెంటనే ఎన్నికల సంఘానికి (Electoral Commission) ఫిర్యాదు చేయండి. మీ ఓటుపై ఎలాంటి అనుమానాలు, సందేహాలు ఉన్నాఈసీకి తెలియజేయాలి. రేపు జరుగుతున్న పోలింగ్‌పై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్లరామయ్య కీలక సూచనలు చేశారు.
Andhrapradesh: పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లో ఇంకా అయోమయం నెలకొందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అక్కడ ఇక్కడ అంటూ ఓటు వినియోగించుకోకుండా ఉద్యోగులను అధికారులు ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. పోస్టల్ బ్యాలెట్‌పై చాలా మంది జిల్లా కలెక్టర్లకు, ఆర్వోలకు క్లారిటీ లేదన్నారు. పోస్టల్ బ్యాలెట్‌ను ఉద్యోగులు సక్రమంగా వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ దే అని తెలిపారు.
ఏపీ ఎన్నికల సంఘాన్ని (Election Commission) తెలుగుదేశం పార్టీ నేతలు కలిశారు. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాకు పలు ఫిర్యాదులు చేశామని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనలో చాలా మంది అధికారులు నిమగ్నమయ్యారని.. 1000 మంది ప్రత్యేక పోలీస్ అధికారులు ఎన్నికల డ్యూటీలో ఉన్నారని.. వారిని రేపు(బుధవారం) ఇక్కడికి పిలిపించి ఓటు వేశాక తిరిగి 14న ఎన్నికల విధులకు పంపాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) తెలిపారు.
పోస్టల్ బ్యాలెట్ , పోలింగ్ సమయంలో పరీక్షలపై ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) ఫిర్యాదు చేశారు. సోమవారం నాడు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఏపీ విద్యార్థులకు మే 14న పరీక్షలు ఉన్నాయని వివరించారు.